Damage to Organs With Covid: కరోనా సోకిన వారిలో ఏడాది తర్వాత అవయువాలు డ్యామేజి, షాకింగ్ విషయాలను వెల్లడించిన బ్రిటీష్ పరిశోధకులు
దీర్ఘకాలిక కోవిడ్ (లాంగ్ కోవిడ్) లక్షణాలు కరోనా బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు, ఛాతీ, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ రోగులను ఇంకా వెంటాడుతున్నాయి.
మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీర్ఘకాలిక కోవిడ్ (లాంగ్ కోవిడ్) లక్షణాలు కరోనా బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు, ఛాతీ, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ రోగులను ఇంకా వెంటాడుతున్నాయి. తాజాగా బ్రిటీష్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలతో (Long COVID patients) బాధపడుతున్న 59 శాతం మందిలో, కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన ఒక సంవత్సరం తర్వాత, శరీరంలోని కొన్ని అవయవాలు (Damage to Organs With Covid) దెబ్బతిన్నాయి.
కోవిడ్ సోకినప్పుడు పెద్దగా బాధపడని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందని పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధకులు 536 మంది కోవిడ్ రోగులపై అధ్యయనం చేశారు. ఇందులో 13 శాతం మంది కరోనాతో ఆసుపత్రిలో చేరగా, 32 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు. 536 మంది రోగులు ఆరు నెలల తర్వాత 40 నిమిషాల మల్టీ ఆర్గాన్ MRI స్కాన్ చేయించుకున్నారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఈ ఫలితాలను విశ్లేషించగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయన ఫలితాలు 'జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురించబడ్డాయి. 536 మంది రోగులలో అరవై రెండు శాతం (331) మందికి 6 నెలల తర్వాత కొంత అవయవ సమస్య ఉంది. 155 మందికి ఒకటి కంటే ఎక్కువ అవయవాలు దెబ్బతిన్నాయి. 6 నెలల నుండి ఒక సంవత్సరం వరకు లక్షణాలు క్రమంగా కనిపించాయని పరిశోధకులు గమనించారు.
కరోనా లక్షణాలు కనిపించిన ఒక సంవత్సరం తర్వాత, 59 శాతం మందికి (59 pc of Long COVID patients) ఏదో ఒక రకమైన అవయవాలు దెబ్బతిన్నాయి. ప్రతి ఐదుగురిలో కనీసం ముగ్గురి అవయవాలు దెబ్బతిన్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బహుళ అవయవ నష్టం జరుగుతుంది. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు జీవన నాణ్యత, పనితీరును ప్రభావితం చేస్తున్నాయి.
దీర్ఘకాలిక కోవిడ్ బాధితుల్లో ఒక సంవత్సరం వరకు లక్షణాలు ఉంటాయి. ఆరు నుండి ఒక సంవత్సరం వరకు మహిళలు, యువకులలో లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. వాటిలో, ఒక అవయవం మాత్రమే దెబ్బతింది. మా పరిశోధన ప్రకారం ఐదుగురిలో కనీసం ముగ్గురు వ్యక్తులు కనీసం ఒక అవయవానికి నష్టం కలిగి ఉంటారని నివేదికలో తెలిపారు.
ప్రతి నలుగురిలో ఒకరికి ఒకటి కంటే ఎక్కువ అవయవాలు (మల్టీ-ఆర్గాన్ డ్యామేజ్) దెబ్బతిన్నట్లు మేము కనుగొన్నాము. కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు లేకుండా రావడం ఆశ్చర్యకరం. ఈ సుదీర్ఘ కోవిడ్ సమస్యలు చాలా మంది జీవిత నాణ్యతను, పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 180 రోజుల తర్వాత సమస్యలు తలెత్తాయని నివేదిక తెలిపింది.