Cucumbers: బరువు తగ్గాలంటే మీ డైట్‌లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే, కీరదోసకాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు
రోజుకు ఒక్క కీరదోసకాయ తినడం మంచిది. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. కాబట్టి, మీరు ఒకటి కంటే ఎక్కువ తింటే, అది ఎటువంటి హాని కలిగించదు. జంక్ ఫుడ్ తినకుండా ఇలాంటివి తింటుంటే కొవ్వు పెరగకుండా వుంటుంది.
కీరదోసకాయ ఆరోగ్యానికి చక్కని ఔషధం. సౌందర్యానికి ప్రియనేస్తం. బరువు పెరిగినవారికి బద్ధ శత్రువు. వేసవి దాహం..తాపం తీర్చే మంచినీటి సరస్సు కీర దోసకాయ. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీన్ని తింటున్నారు. కీరదోసకాయలో (Health Benefits of Eating Cucumber) కొవ్వు నిల్. తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి (can help you lose weight) ఇది అద్భుతమైన చిరుతిండి అని చెప్పవచ్చు.
కాబట్టి కొన్ని కీరదోసకాయలను (Cucumbers) సలాడ్‌లలో వేసుకుని తినండి. బరువు తగ్గడానికి ఇది బాగా దోహదం చేస్తుంది. కొందరు కీరదోసకు నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు జోడించి తింటుంటారు రుచి కోసం. రోజుకు ఒక్క కీరదోసకాయ తినడం మంచిది. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. కాబట్టి, మీరు ఒకటి కంటే ఎక్కువ తింటే, అది ఎటువంటి హాని కలిగించదు. జంక్ ఫుడ్ తినకుండా ఇలాంటివి తింటుంటే కొవ్వు పెరగకుండా వుంటుంది.
కీరదోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి. ఇది హానికరమైన టాక్సిన్స్ ను బాడీ నుండి ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరదోసకాయను రోజులో ఎప్పుడైనా తినవచ్చు. అలాగే కీరదోసకాయకు క్యారెట్, ఆపిల్స్, మస్క్ మెలోన్ వంటివి జోడించి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. రోజూ కీరదోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. మేజర్ హెల్త్ సమస్యలను నివారించడంలో కూడా కీరదోస గ్రేట్ గా సహాయపడుతుంది.
కీరదోసకాయ కిడ్నీని శుభ్రపరచడంలో, టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేయడంలో గ్రేట్ నేచురల్ రెమెడీ. ఇందులో విటమిన్స్, మినిరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, బ్లాడర్ మరియు కిడ్నీ స్టోన్స్ ను కరిగించి బయటకు నెట్టేస్తుంది. ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ను బాడీ నుండి తొలగిస్తుంది, దాంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది,.కీరలో ఉండే ఔషధగుణాల వల్ల బ్రెస్ట్, యుటేరియన్, ప్రొస్టేట్ వంటి వివిధ రకాల క్యాన్సర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫాలీఫినాల్స్, ఫైటోన్యూట్రీయంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.
రోజూ నాలుగు కీరదోసముక్కలు తినడం వల్ల స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. పొట్టకు చల్లదనం అందిస్తుంది,. కీరదోసలో ఉండే ఆల్కనిటి స్టొమక్ అల్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రెండు గ్లాసులు కీరదోస జ్యూస్ తాగడం వల్ల ఇది స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. కీరదోసకాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. హైబిపి, లోబిపి రెండింటిని కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
కీరదోసకాయలో 95శాతం నీరు ఉండటం వల్ల, వేడి వాతావరణం లేదా హాట్ సమ్మర్ లో శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. కాబట్టి రోజూ ఫ్రెష్ కీరదోసకాయను తినడం మంచిది. హైడ్రేషన్ మాత్రమే కాదు, ఆకలి తగ్గిస్తుంది.తలనొప్పితో బాధపడే వారు ?కీరదోసకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. దీనిలో ఉండే విటమిన్ బి, వాటర్ కంటెంట్, మరియు ఎలక్ట్రోలైట్స్ కారణంగా తలనొప్పి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. హ్యాంగోవర్ తలనొప్పి కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.
కీరదోసలో అమేజింగ్ బ్యూటీ స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే మెగ్నీషియ, పొటాషియం, మరియు సిలికాన్ స్కిన్ ఫ్రెండ్లీ మినిరల్స్, ఇది హెల్తీ గ్లోయింగ్ స్కిన్ ప్రోత్సహిస్తుంది. జు నిద్రపోయేముందు కీరదోసకాయను చక్రల్లా కట్ చేసిన ముక్కలను పెట్టుకుంటే కల్ల కింద నల్లని వలయాలు, వాపులు తగ్గుతాయి. అలసిన కళ్లకు సేద తీరేలగా చేస్తుంది. కళ్ళ దగ్గర చర్మ కాంతి పెంచుతుంది. ఇందులో ఉండే ఆస్కార్బిక్ మరియు కాఫిక్ పుష్కలంగా ఉండటం. ఇంకా కీరదోసకాయ తొక్కు సూర్యరశ్మి వల్ల పాడైన చర్మాన్ని తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కీర ముక్కల్ల్ని కంటిమీద పెడితే మంట తగ్గుతుంది.
కీరదోసకాయను తరచూ తినడం వల్ల ఎసిడిటి, గుండెల్లో, పొట్టలో పుండ్లు మరియు పూతల వంటి పలు జీర్ణ అల్సర్లకు కీర దోసకాయ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. కీరదోసకాయలో ఉండే నీరు మరియు డైటరీ ఫైబర్ మనం తినే ఎటువంటి ఆహారాన్నైనా సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దోసకాయ కూడా క్రమం తప్పకుండా వినియోగించే ఉంటే, దీర్ఘకాల మలబద్ధకం వ్యతిరేకంగా ఉపయోగకరంగా గుర్తించారు. దోసకాయ మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడం ద్వారా మధుమేహం నియంత్రిస్తుంది. శరీరంలో యూరిక్ ఆమ్లం పెరుకోవడం ద్వార వచ్చే కీళ్ళ జబ్బులకు కీర రసంలో క్యారెట్ రసం కలిపి తాగితే ఎంతో మంచిది. డయాబెటిస్ వాళ్లకి కూడ ఇది చాల మంచి ఆహారం.
మంచి నీళ్లను ఇలా తాగితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100కు పైగా రోగాలు మాయం అవుతాయి...
కీర దోసకాయలో స్టెరాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. చాతీ, ఉపిరితిత్తులు , ఉదర వ్యాదులకు కీర ఎంతో మంచిది. ఇందులోని పొటాషియం బీపిని నియంత్రణలో ఉంచితే మేగ్నీషియం రక్త ప్రసరణకు మెరుగుపరచి నరాలు, కండరాలు కదలికలకు ప్రాణం పోస్తుంది. ఇక కీరలో పీచు కొలస్ట్రాల్ శాతాన్ని నియంత్రిస్తుంది. ఇలా చెప్పకుంటూ పోతే కీరదోసకాయలో ఎన్నో అందానికి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలున్నాయి. కీరదోసకాయ తినడానికి సమయం సందర్బం ఏవీ అవసరం లేదు, రోజులో ఎప్పుడు తిన్నా అద్భుత ప్రయోజనాలను పొందివచ్చు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)