శీతాకాలంలో సీతాఫలం పండ్లు లభిస్తాయి . ఇవి ఆగస్ట్ నుంచి జనవరి మధ్య కాలంలో సీతాఫలాలు లభిస్తాయి . చుడటానికి ఒకేలా ఉన్న వాసన, రుచి మాత్రం వేరేలా ఉంటుంది. ఈ పండ్లను ఏ సీజన్ లో లభిస్తాయో ఆ సీజన్ లోనే తినాలి. తరువాత ఇవి తినాలన్నా దొరకవు. కాని సీతాఫలం చెట్టు ఆకులు (Custard Apple Leaves) మాత్రం అలా కాదు ఏప్పుడైనా లభిస్తాయి. విటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటి ఆకులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేయవచ్చు. మరి సీతాఫలం ఆకును ఏలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
సీతాఫలం ఆకులలో (Custard Apple Leaves) యాంటిఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి . ఇది సూర్యుడు నుండి వంచే అతినిల లోహిత కిరణాల బారి నుండి చర్మాన్ని కాపాడుతుంది. అంతేకాదు చర్మంను ముడతలు పడకుండా చేస్తుంది . ఈ ఆకును (Custard Apple Leaves) వేసి మరిగించిన నిటిని తాగుతుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి . కాలిన గాయలు . పుండ్లను మానేలా చేసేందుకు సీతాఫలం ఆకులు (Custard Apple Leaves) ఉపయోగపడతాయి . వీటిని మూడు లేదా నాలుగు తిసుకోని పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని గాయలు .పుండ్లపై రాస్తుండాలి . దింతో అవి త్వరగా మానుతాయి.
డయాబెటిక్ వ్యాధి గ్రస్థులకు సీతాఫలం ఆకులు (Custard Apple Leaves) చాలా బాగా పని చేస్తాతాయి . ఈ ఆకులను రెండు లేదా మూడు తిసుకోని నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని రోజు పరగడపున తాగుతుండాలి . దింతో రక్తంలో చక్కెరల స్థాయిలు పెరగనివ్వకుండా కంట్రోల్ లో ఉంచుతుంది .సీతాఫలం ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నిటిని తాగడం వలన మన శరిరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది . ఎక్కువగా ఇన్ ఫెక్షన్స్ . ఇతర వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. సీతాఫలం ఆకులలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది . ఈ ఆకులతో తయారుచేసిన నిటిని రోజుతాగడం వలన గుండె జబ్బులు అనేవి రావు . ముఖ్యంగా హర్ట్ ఎటాక్ లు వంటివి రాకుండా జాగ్రత పడవచ్చు.