Lemon Honey Benefits: ఉదయం తేనే, నిమ్మకాయ రసం నీళ్లను తాగతే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు, నిమ్మ కాయ రసం, తేనే లాభాలు ఇవే
సేద తీర్చే సువాసన, అలసట పోగొట్టే రుచి ఉన్నాయి కాబట్టే టీల్లో, కాక్‌టైల్స్‌లో, సాస్‌ల్లో కూడా వినియోగిస్తారు. విటమిన్‌సి పుష్కలంగా ఉండటం వల్ల నిమ్మకాయ వైరస్ లపై పోరాడుతుంది.
Health Benefits of Honey and Lemon Water: ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి, కాస్త తేనెతో తాగండి అంటుంటారు నిపుణులు. నిమ్మకాయ నీళ్లలో ఏముందీ? ఎందుకు తాగాలి అంటే నిమ్మకాయ సిట్రస్ జాతికి చెందినవి. సేద తీర్చే సువాసన, అలసట పోగొట్టే రుచి ఉన్నాయి కాబట్టే టీల్లో, కాక్‌టైల్స్‌లో, సాస్‌ల్లో కూడా వినియోగిస్తారు. విటమిన్‌సి పుష్కలంగా ఉండటం వల్ల నిమ్మకాయ వైరస్ లపై పోరాడుతుంది. ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే యాంటీబాడీస్‌పై పోరాడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వ్యర్థాలను బయటకి పంపటంలో సహాయపడుతుంది. ప్రతి ఉదయం నిమ్మరసం తాగితే నోటిలో ఉండే లాలాజలం చురుగ్గా, నోరు ఎండిపోకుండా ఉంటుంది. బ్యాక్టీరియా పెరగదు. పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పంటినొప్పులు రావు. మొహం ముడతలు పడటం, దద్దుర్లు, పొక్కులు, మచ్చలు రావటం వంటివి తగ్గుతాయి. చర్మాన్ని తాజాగా ఉంచగలుగుతుంది నిమ్మరసం. ఉదయాన్నే వ్యాయామం చేసేవారికి అవసరమైన శక్తి సమకూరుతుంది.
తూర్పుగోదావరిలో విషాదం, కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నిమ్మలో పుష్కలంగా పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఇంకా మినరల్స్ ఉండటం చేత ఒక్క గ్లాసు నిమ్మరసం శరీరాన్ని తేమగా ఆరోగ్యవంతంగా ఉంచగలుగుతుంది. మూత్ర పిండాల్లో రాళ్లతో ఇబ్బంది పడేవారికి నిమ్మలో ఉండే సిట్రస్ ఆమ్లం గొప్ప ఔషధం. నిమ్మరసం తాగితే ఎసిడిటీ తగ్గించటం, అరుగుదల సమస్యలు రాకుండా ఉంటుంది. జలుబును తగ్గిస్తుంది. శ్వాసకోశానికి వచ్చే ఇన్ఫెక్షన్లు, గొంతుకు సంబంధించిన టాన్సిల్స్, వాపు వంటి ఇన్‌ఫ్లమేషన్ మీద పోరాటం చేస్తుంది. వీటితోపాటు పట్టు చీరకు వదలని ఏ వాసననైనా నిమ్మచెక్కతో రుద్దితే పోతుంది. ఎంత సబుతో తోమినా వదలని వెల్లుల్లి, మసాలా వాసనలు నిమ్మరసం చుక్కతో పోతాయి. బరువు తగ్గి శరీరం సన్నబడేందుకు కావలసిన ఎన్నో ఆహార ప్రణాళికలు డాక్టర్ల దగ్గర తెలుసుకోవచ్చు. ఇన్నిపోషకాలున్న నిమ్మకాయను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.