Andhra Pradesh: తూర్పుగోదావరిలో విషాదం, కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి, మరొకరి పరిస్థితి విషమం
spurious toddy (Photo-PTI)

Amaravati, Feb 2: తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి (Four tribals dies) చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు.

లోదొడ్డిలో కల్తీ కల్లు ( consuming adulterated toddy ) తాగిన ఐదుగురులో నలుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాద చాయలు నెలకొంది. కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారిలో వేమ లోవరాజు (28), చెదల సుగ్రీవ్ (70), లు బుసరి సన్యాసిరావు (65), పుత్తూరు గంగరాజు(36) ఉన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏసుబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు ఉదయం కల్తీ కల్లు తాగిన ఐదుగురుకి కడుపులో మంట, వాంతులు అయ్యాయి. అనంతరం కొద్ది సేపటికే నలుగురు మృతి చెందారు. కల్తీ కల్లుపై జండంగి పోలీసులు విచారణ చేపట్టారు.