Health Tips: క్యాలీఫ్లవర్, క్యాబేజీ కూరలు తింటున్నారా..అయితే ఈ లాభాలు తెలిస్తే..ప్రతిరోజూ మీ డైట్ లో చేర్చుకోవడం ఖాయం..

క్యాలీఫ్లవర్ లో విటమిన్ సి, కె, బి6 ఉంటాయి. అలాగే క్యాబేజీ లో కూడా విటమిన్ సి, కె మాత్రమే గణనీయమైన స్థాయిలో ఉంటాయి. రెండు డైటరీ ఫైబర్ కు సంబంధించినవే. ఇవి జీర్ణ ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడతాయి.

File

క్యాలీఫ్లవర్, క్యాబేజీ రెండు చాలా మంది ఇష్టపడే కూరగాయలు.ఈ రెండు కూరగాయలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమయంలో కాలానుగుణంగా తీసుకునే కూరగాయలు కీలకపాత్ర వహిస్తాయి. వాటిలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ కూడా ఉన్నాయి. ఈ రెండు కూరగాయలు క్రూసిఫరస్ కుటుంబానికి చెందినవి. వీటిలో ఉండే పోషక విలువలు ఈ శీతాకాలంలో కలగచేసే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఈ రెండూ విటమిన్లు, ఫోలేట్ తో నిండిన పోషకాలు అధికంగా లభించే కూరగాయలు. క్యాలీఫ్లవర్ లో విటమిన్ సి, కె, బి6 ఉంటాయి. అలాగే క్యాబేజీ లో కూడా విటమిన్ సి, కె మాత్రమే గణనీయమైన స్థాయిలో ఉంటాయి. రెండు డైటరీ ఫైబర్ కు సంబంధించినవే. ఇవి జీర్ణ ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడతాయి.

ఎక్కువ కేలరీలు తీసుకోవడంలో శ్రద్ధ వహించే వారికి క్యాలీఫ్లవర్, క్యాబేజీ కూరగాయలు బాగా పని చేస్తాయి. ఈ కూరగాయలు బరువు తగ్గించడంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. క్యాబేజీ కంటే క్యాలీఫ్లవర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

క్యాలీఫ్లవర్, క్యాబేజీతో సహా క్రూసిఫెరస్ చెందిన కూరగాయలు క్యాన్సర్ పోరాట లక్షణాలకు ప్రసిద్ధి. ఈ రెండు కూరగాయలలో ఉన్న సల్పోరాఫేన్, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి సహాయపడతాయి. ఈ రెండు కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి తప్పించుకోవచ్చు.

అదే విధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలా మందికి ఎంతో అవసరం. క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఈ రెండు గుండెకు సంబంధించిన విషయంలో అనేక ప్రయోజనాలను అందజేస్తుంది. అయితే క్యాబేజీ లోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో తప్పకుండా ఈ కూరగాయలను చేర్చడం ద్వారా హృదయనాళం ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రతి మనిషికి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే హాని నుండి ఈ రెండు కూరగాయలు రక్షించడానికి దోహదపడతాయి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ ప్రత్యేక యాంటీఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. క్యాలీఫ్లవర్ లో సల్పోరాఫేన్ ఉంటంది. క్యాబేజీ లో మాత్రం ఆంథోసైనిన్ లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి.హానికరమైన అణువులతో ఇవి పోరాడుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. అలాగే క్యాలీఫ్లవర్, క్యాబేజీ తినడం వల్ల శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,