Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా..ఈ టిప్స్ తో పీరియడ్స్ సక్రమంగా వస్తాయి.
ఇది వారి ఆరోగ్యానికి సంబంధించింది అయితే ప్రతి ఒక్కరి పీరియడ్స్ అనేవి ఒకేలా ఉండవు. కొంతమందిలో రుతు చక్రం నాలుగు రోజులకు ముందు వస్తుంది.
స్త్రీలలో పిరియడ్స్ అనేవి చాలా ముఖ్యమైనది. ఇది వారి ఆరోగ్యానికి సంబంధించింది అయితే ప్రతి ఒక్కరి పీరియడ్స్ అనేవి ఒకేలా ఉండవు. కొంతమందిలో రుతు చక్రం నాలుగు రోజులకు ముందు వస్తుంది. కొంతమందిలో ఆరు రోజుల తర్వాత వస్తుంది. ఇంకొంత మందిలో పిరియడ్స్ అనేవి చాలా ఇర్ రెగ్యులర్గా ఉంటాయి. నెల దాకా 15 డేస్ వరకు కూడా రాకుండా ఉంటాయి. దీనికి కారణాలు మనం తెలుసుకున్నట్లయితే మన జీవన శైలిలో మార్పు మానసిక ఒత్తిడి నిద్రలేమి ప్రయాణాలు అధికంగా చేయడం ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఇర్రెగ్యులర్ పిరియడ్స్ కి కారణాలు తెలుసుకుందాం.
ఒత్తిడి: కొంతమంది మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ , కుటుంబ పరంగా కొన్ని రకాలైన సమస్యల వల్ల వారు ఒత్తిడికి గురవుతారు. అప్పుడు మన శరీరంలో కార్టీసాల్ హార్మోను రిలీజ్ అవుతుంది. ఇది పీరియడ్స్ హార్మోనల్ ఇన్ బాలన్స్ చేస్తుంది. దీని ఫలితంగా పిరియడ్స్ లేట్ అవుతూ ఉంటాయి.
నిద్రలేమి: నిద్రలేమి వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. శరీరానికి తగినంత నిద్ర అవసరం. ప్రతిరోజు కనీసం 8 గంటల పాటు నిద్ర ఉన్నట్లయితే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. లేకపోతే మన శరీరంలో హార్మోన్స్ అనేవి సమతుల్యతను దెబ్బతీసి పీరియడ్స్ లేట్ రావడానికి కారణం అవుతుంది.
Health Tips: షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా.
మూడ్ స్వింగ్స్: కొంతమంది మహిళల్లో తరచుగా మూడు స్వింగ్స్ వస్తూ ఉంటాయి. దీనికి కారణం అలసట నీరసం ఒత్తిడి వల్ల ఈ మూడు స్వింగ్స్ ఏర్పడతాయి. ఈ మూడ్ స్వింగ్స్ ద్వారా పీరియడ్స్ అనేవి ఆలస్యం కావచ్చు దీనివల్ల నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది.
గర్భనిరోధక మాత్రలు: కొంతమంది పెళ్లైన మహిళలు అప్పుడే పిల్లలు వద్దనుకోవడం కోసం కొన్ని రకాలైన గర్భనిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు. దీని వల్ల కూడా మీకు పీరియడ్స్ ఆలస్యం అవ్వచ్చు.
జంక్ ఫుడ్: పిరియడ్ సక్రమంగా రావడం కోసం మహిళలు ఎక్కువగా పోషకాహారం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవాలి. అలా కాకుండా జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి. ముఖ్యంగా పిజ్జా, బర్గర్, ఐటమ్స్ తీసుకున్నప్పుడు మీకు పిరియడ్ సక్రమంగా రాదు. మీరు పీరియడ్స్ లో ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.