Health Tips: ఆపరేషన్ లేకుండానే కిడ్నీలో రాళ్లను తొలగించుకోవాలని అనుకుంటున్నారా, అయితే ఇలా చేసి చూడండి, ఎంత పెద్ద రాయి అయినా చూర్ణమై పులుసులా కారిపోవాల్సిందే..
కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ప్రతి 20 మందిలో 6 నుంచి 7 మందికి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్న వారికి కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత తగినంత వ్యాయామం చేయకపోవడం నీరు ఎక్కువగా తాగకపోవడం మితిమీరినటువంటి ఉప్పు వాడడం ఈ రాళ్లు ఏర్పడడానికి కారణాలవుతూ ఉంటాయి.
మూత్రపిండాల్లోని మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడి స్టోన్స్ లాగా మారుతాయి. అందుకే వీటికి కిడ్నీ స్టోన్స్ అనే పేరు వచ్చింది. ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. మూత్రం వెళ్లేటప్పుడు భరించలేనటువంటి నొప్పి ఉంటుంది ఒక్కొక్కసారి మూత్రం నుండి రక్తం కూడా పడుతుంది. ముందు జాగ్రత్త తో దీనిని మందులతోటి తగ్గించుకోవచ్చు. కొన్ని జీవన శైలిలో మార్పుల ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే ఈ మూత్రపిండాల్లోనే రాళ్లు కరిగిపోతాయి. అవి ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల మంచినీళ్లకు రావాలి దీని ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు అనేవి కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. శరీరంలో. ఉన్నటువంటి మలినాలను బయటికి పంపించాలి. దీనితో పాటు ఒక చిట్కా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఉలవలను సుమారు నాలుగు గంటలు నానబెట్టుకొని తర్వాత ఉడకపెట్టి ఆ నీటితో పాటు ఉలవలను కూడా తింటే మీ కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లు కరిగిపోయి మూత్రం రూపంలో బయటకు వస్తాయి. ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనితోపాటు ప్రతిరోజు వ్యాయామం చేయడం తగినంత నీరు తీసుకోవడం ఆహారంలో ఉప్పును తగ్గించడం ఇటువంటివి ఆచరించినట్లయితే కచ్చితంగా మీరు మూత్రపిండాల్లో ఏర్పడినటువంటి రాళ్ల సమస్యకు నుంచి బయటపడతారు