Health Tips: వర్షాకాలంలో జ్వరం మళ్ళీ మళ్ళీ వస్తుందా..అయితే కారణాలేంటో తెలుసుకుందాం.
ఈ సీజన్లో చల్లగా ఉండటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు ,ఫ్లూ వంటి లక్షణాల్లో పిల్లలను పెద్దలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
వర్షాకాలంలో వాతావరణం మార్పు వల్ల చాలామందిలో జ్వరం కారణం. ఈ సీజన్లో చల్లగా ఉండటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు ,ఫ్లూ వంటి లక్షణాల్లో పిల్లలను పెద్దలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సైనస్ మైగ్రేన్ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి, వర్షాకాలంలో పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండాలి, జ్వరం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి, దానికి కారణాలు తెలుసుకోవాలి.
వైరల్ ఇన్ఫెక్షన్స్: మీకు తరచుగా జ్వరం వస్తున్నట్లయితే అది వైరల్ ఇన్ఫెక్షన్, డెంగ్యూ, చికెన్ గున్యా, తదితరకాలైన వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తున్నాయని గమనించగలరు, దీని ద్వారా అకస్మాత్తుగా హై టెంపరేచర్, తలనొప్పి, నీరసంగా ఉండడం ఒంటిపైన దద్దురులు రావడం ఏర్పడతాయి కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్: ఈ వర్షాకాలంలో కేవలం వైరల్ ఇన్ఫెక్షన్ కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో కూడా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా నిమోనియం వంటి కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. వీటి ద్వారా తరచుగా జ్వరము అదేవిధంగా కడుపులో నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం రకాలైన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటినుంచి బయటపడవచ్చు.
Health Tips: పదేళ్లు కూడా దాటని పసివాళ్లకు హై బీపీతో గుండె పోటు ...
నీటి నిల్వ ఉన్న ప్రదేశాలు: వర్షాకాలంలో మురికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నిల్వ ఉన్న నీటిలో ఇన్ఫెక్షన్ కారకాలైనటువంటి దోమలకు నివాసంగా ఉంటుంది .దీని ద్వారా ఇన్ఫెక్షన్లు అనేవి మరింతగా పెరుగుతాయి. ఇది కూడా తరచు జ్వరం రావడానికి కారణం అవుతుంది.
అలర్జీలు: కొంతమందికి ఈ వర్షాకాలంలో ఎలర్జీల కారణంగా కూడా జ్వరం అనేది తరుచుగా వస్తుంది. కాబట్టి వారు ఎలర్జీలకు సంబంధించిన కారణాలు తెలుసుకొని వాటికి దూరంగా ఉంటే మంచిది.
అంతేకాకుండా కొంతమంది లో వర్షాకాలంలో చలి కారణంగా సైనస్ ప్రాబ్లం, శ్వాసకోశ సమస్యలు తో ఇన్ఫెక్షన్లకు గురై జ్వరము రావచ్చు అటువంటివారు డాక్టర్ని సంప్రదించి లక్షణాలు తెలుసుకొని తగిన మేరకు చికిత్స పొందుతే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.