kids bp

ఈ మధ్యకాలంలో పిల్లల్లో హై బీపీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా వారిలో గుండెపోటుకు సంబంధించినటువంటి మరణాలు సైతం సంభవిస్తున్నట్లు ఇటీవల వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం. . అయితే చిన్న వయసులో హైబీపీ అనేది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు 60 దాటిన తర్వాత రావాల్సిన హైబీపీ పదేళ్లు కూడా లేని పిల్లలకు ఎందుకు వస్తుంది అనే ఆందోళన కూడా మొదలైంది. ఈ నేపథ్యంలోనే కెనడాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలను తెలియజేశారు. పిల్లల్లో వచ్చే హైపర్ టెన్షన్ వల్ల స్ట్రోక్ , గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని నాలుగు రెట్లు పెంచుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. కెనడాలోని అంటారియోలో 1996 , 2021 మధ్య అధిక రక్తపోటు ఉన్న 25,605 మంది పిల్లల పై ఈ పరిశోధన జరిగింది.

అధిక రక్తపోటు ఉన్న పిల్లలు, యువకులకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ అని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన అధిక రక్తపోటును నియంత్రించడం , చిన్న వయస్సులోనే దాని ప్రమాదాలను తగ్గించడం ప్రాముఖ్యతను గురించి చెబుతుంది.

షాకింగ్  విషయాలు

అధిక రక్తపోటు ఉన్న పిల్లలు , మధుమేహం ఉన్న కౌమారదశలో ఉన్నవారు పెద్దవారిలో గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె శస్త్రచికిత్స ప్రమాదాన్ని రెండు నుండి నాలుగు రెట్లు కలిగి ఉంటారు.

- అధిక రక్తపోటును నియంత్రించడానికి , చిన్న వయస్సులోనే దాని ప్రమాదాలను తగ్గించడానికి అవగాహన , నివారణ చర్యలు అవసరం.

- తలనొప్పి, అలసట, ముక్కు నుండి రక్తస్రావం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అధిక రక్తపోటు లక్షణాల ఉన్న పిల్లలు , యువకుల పట్ల శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.

పిల్లలలో అధిక రక్తపోటుకు ప్రమాద కారకాలు

- పోషకాలు లేని ఆహారం

- శారీరక శ్రమ లేకపోవడం

- అధిక రక్తపోటు కుటుంబ చరిత్ర

- ఒత్తిడి

పిల్లల్లో అధిక బీపీని నియంత్రించే చిట్కాలు

- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

- ఆరోగ్యకరమైన బరువు ఉండాలి.

- ఒత్తిడిని తగ్గించండి

- అవసరమైతే మందులు తీసుకోండి