Health Tips: చలికాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది..
ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకు అంతా మంచిది కాదు. మారుతున్న వాతావరణం కారణంగా చాలామందిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.
చలికాలం వచ్చిందంటే చాలు అనేకరకాల అనారోగ్య సమస్యలు చుట్టూముడతాయి. ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకు అంతా మంచిది కాదు. మారుతున్న వాతావరణం కారణంగా చాలామందిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మనం రోజు తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా ఈ సమస్య మరింతగా ఎక్కువవుతుంది. అయితే చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ- మామూలు సమయాలతో పోలిస్తే చలికాలలో ఉల్లిపాయ తినడం తగ్గించడం మంచిది. ఉల్లిలో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. దీని ఎసిడిక్ నేచర్ వల్ల మనం తొందరగా గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఏర్పడతాయి. చలికాలంలో ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు. అటువంటి పరిస్థితుల్లో ఉల్లిపాయ తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది. కాబట్టి చలికాలంలో ఉల్లిపాయను తక్కువగా వాడితే మంచిది.
Health Tips: సైనస్ సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారా,
జీలకర్ర- జీలకర్రను కూడా చలికాలంలో వాడకుండా ఉంటే మంచిది. ఫైల్స్ పీరియడ్స్ సమయంలో మహిళలు ఎక్కువగా జీలకర్ర తీసుకోవడం ద్వారా అధిక రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు జీలకర్రను తగ్గించుకుంటే మంచిది. మామూలుగా ఉన్న వ్యక్తులు కూడా చలికాలంలో జీలకర్ర వాడకాన్ని తగ్గించాలి. ఇది అతి వేడిని పెంచే విధంగా ఉంటుంది.
వెల్లుల్లి- ఆరోగ్యానికి మంచిదైనప్పటికి కూడా చలికాలంలో మాత్రం దీన్ని తగ్గించడం మంచిది. వెల్లుల్లి అతి వేడిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గిపోయినప్పటికీ కూడా అధిక వేడి కారణంగా మీకు జీల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఎక్కువగా వాడడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చలికాలంలో వెల్లుల్లికి దూరంగా ఉంటే మంచిది.
ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాలు- చలికాలంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడమే ఉత్తమం. దీని వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చలికాలంలో ఏది తీసుకున్నప్పటి కూడా అప్పటికప్పుడు వేడివేడిగా వండిన ఆహారాలు మాత్రమే తీసుకుంటే మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి