'Femotidine Helps Fight Covid': కరోనా నుంచి కాపాడే ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు, గుండె మంట తగ్గేందుకు వాడే ఫామోటిడిన్‌ కోవిడ్‌ను నియంత్రిస్తుందట, ఆస్ప్రిన్‌తో కలిపి దీన్నివాడితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్న వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు

సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ & టార్గెటెడ్ థెరపీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దీర్ఘకాలికంగా గుండెల్లో మంటతో బాధపడుతున్న ఓవర్ ది కౌంటర్ యాసిడ్ సప్రెసర్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు కరోనా నుంచి రక్షణ ('Femotidine Helps Fight Covid) పొందుతున్నారని తెలిపింది.

Coronavirus Outbreak (Photo Credits: IANS)

గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలాలాడుతోంది. కరోనాతో (Coronavirus) గ్లోబల్ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా దీనిని నియంత్రణలోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే దానిని కంట్రోల్ చేసే ఔషధాలపై ప్రయోగాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా కొన్ని ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వగా మరికొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి.

సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ & టార్గెటెడ్ థెరపీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దీర్ఘకాలికంగా గుండెల్లో మంటతో బాధపడుతున్న ఓవర్ ది కౌంటర్ యాసిడ్ సప్రెసర్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు కరోనా నుంచి రక్షణ ('Femotidine Helps Fight Covid) పొందుతున్నారని తెలిపింది. కడుపులో ఆమ్లం ఉత్పత్తికి సహాయపడే హిస్టామిన్ గ్రాహకాలను నిరోధించడానికి ఫామోటిడిన్ అనే తక్కువ ధర కలిగిన ఔషధం పెప్సిడ్‌ను కలిగి ఉందని పరిశోధనలో తేలింది.

ఈ అధ్యయనం ప్రకారం, ఫామోటిడిన్ అధిక మోతాదులో (దాదాపు 10 పెప్సిడ్ మాత్రలకు సమానంగా), ముఖ్యంగా ఆస్పిరిన్‌తో కలిపి (Famotidine' Along With Aspirin) ఇచ్చినప్పుడు కోవిడ్ -19 రోగుల మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఇది అనారోగ్య తీవ్రతను తగ్గిస్తుంది, ఇంట్యూబేషన్ లేదా వెంటిలేటర్ అవసరమయ్యే రోగులు త్వరగా కోలుకునేలా చేస్తుందని తెలిపింది. వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన ప్రకారం నిర్దిష్ట మోతాదులో ఫామోటిడిన్‌ ఔషధాన్ని పొందిన కరోనా బాధితులకు ప్రాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించారు.

కడుపు ఉబ్బరంగా ఉంటుందా, గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ కావడం లేదా, వెంటనే మీ ఆహార పదార్థాల మెనూలో మార్పులు చేసుకోండి, ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గించుకోవచ్చు

వీరు 30 దేశాల్లోని 22వేల మంది కొవిడ్‌ బాధితుల వైద్య రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఆస్ప్రిన్‌తో కలిపి దీన్ని వాడినప్పుడు ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తేల్చారు. వెంటిలేటర్‌ వంటి సాధనాలను అమర్చాల్సిన స్థితికి వీరి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్పారు. ఇన్‌ఫెక్షన్‌కు ప్రతిగా శరీర రోగనిరోధక వ్యవస్థ సైటోకైన్‌ అనే ప్రొటీన్లు వెలువరిస్తుంది. అయితే కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యం వల్ల వీటి ఉత్పత్తి కట్టు తప్పి ‘సైటోకైన్‌ తుపాను’ చెలరేగుతుంది. అవి ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కణజాలాలనూ దెబ్బతీస్తాయి. ఇలాంటి చర్యను అణచివేయడం ద్వారా కొవిడ్‌ బాధితులకు ఫామోటిడిన్‌ ఉపశమనాన్ని కలిగిస్తుండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఒక వ్యక్తికి వ్యాధి సోకిన తర్వాత, రోగనిరోధక వ్యవస్థ సైటోకిన్స్ అని పిలువబడే ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇన్ఫెక్షన్‌ను ఎలా ఎదుర్కోవాలో రోగనిరోధక కణాలకు మార్గనిర్దేశం చేస్తుంది. అయినప్పటికీ, సైటోకిన్ ఉత్పత్తి నియంత్రణకు మించి మరింత తీవ్రమైన వ్యాధులలో క్రమబద్ధీకరించబడదు. అధ్యయనం యొక్క సీనియర్ శాస్త్రవేత్త, కామెరాన్ మురా వివరిస్తూ.. కరోనావైరస్ ద్వారా "రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కణజాలం వంటి వాటిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. అయితే దీనిని ఫామోటిడిన్ వెంటనే అణిచివేస్తుందని తెలిపారు.

మీ భాగస్వామితో సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే, శృంగారం చేసే సమయంలో మీరు ఈ పనులు చేస్తే ఇద్దరు చాలా మంచి అనుభూతిని పొందుతారు

ఇతర ఔషధాల మాదిరిగానే, ఈ గుండెల్లో మంట మందు కూడా కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అయితే ఎన్ని దుష్ర్పభావాలు ఉన్నా బృందం మాత్రం ఫామోటిడిన్‌ను ఆస్పిరిన్‌తో కలపాలని సిఫార్సు చేసింది. ఫామోటిడిన్ అనేది ఆమ్ల అజీర్ణం మరియు ఆహారాలు లేదా పానీయాల ద్వారా ఉత్పన్నమయ్యే పుల్లని కడుపు వలన గుండెల్లో మంటను నివారించడానికి మరియు నయం చేయడానికి ఉపయోగించే ఒక మందు. Famotidine H2 బ్లాకర్ తరగతికి చెందినది. ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది.

News Source

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now