Sex Tips: మీ భాగస్వామితో సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే, శృంగారం చేసే సమయంలో మీరు ఈ పనులు చేస్తే ఇద్దరు చాలా మంచి అనుభూతిని పొందుతారు
(Photo Credits: Unsplash)

శృంగారం అనేది కామవాంఛను తీర్చుకోవడం మాత్రమే కాదు. అది ఓ చక్కని అనుభూతి. శరీరానికి తిండి ఎంత అవసరమో సెక్స్ (Sex) అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఆటలో ఎవరూ గెలిచినా ఓడినా ఇకరికి ఇష్టం లేకుండా దానిని ఆస్వాదించడం అనేది అసాధ్యం. భార్యాభర్తల (Couples) మధ్య ఎటువంటి అపార్థాలు లేకుండా ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే శృంగారంలో మంచి అనుభూతిని పొందుతారు. సాధారణంగా భార్యభర్తలు ఇంట్లో ఈ విషయంపై చర్చించేందుకు వెనకడుగు వేస్తుంటారు.

ఓ స్థాయి దాటిన తరువాత ఒకరికి కోరికలు ఉంటే మరోకరికి కోరికలు ఉండకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి అవి విడాకుల వరకు వెళుతుంటాయి. అలా కాకుండా మొదటి నుంచి ఈ విషయం మీద భార్యభర్తలు (Spouses) బెడ్ రూంలో చర్చించుకుంటే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు (Sex Tips) పాటిస్తే మీరు ఆరోగ్యకరమైన అనుభూతిని మీ భాగస్వామితో పొందుతారు.

నాతో సెక్స్ చేయ్..డబ్బులు ఎంతైనా ఇస్తా, 16 ఏళ్ల బాలుడితో 42 మహిళా టీచర్ ఛాటింగ్, అమెరికాలో షాకింగ్ ఘటన, నిందితురాలిని అరెస్ట్ చేసి సమ్నర్ కౌంటీ జైలుకు తరలించిన పోలీసులు

మీరు భాగస్వామిని బెడ్ రూంలో మెప్పించగలిగితేనే మీరు మీ భార్య ముందు హీరో అవుతారు. ఆనందాన్ని పొందుతారు. మరి అలా పొందాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.

ప్రేమగా మాట్లాడండి:

సెక్స్‌ను వీలయినంతవరకు మౌనంగా చేయొద్దు. అప్పుడప్పుడు కవ్వించే మాటలతో ఎంజాయ్ చేయండి. ప్రేమగా చెవిలో.. మీ భాగస్వామిపై మీకున్న ఇష్టాన్ని తెలియజేయండి. చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్లో కోరుకునేది ఇదే. సెక్సును పనిగట్టుకుని చేయకుండా.. ప్రేమతో మాట్లాడుతూ చేయాలని భావిస్తారు. కాబట్టి.. మీ భాగస్వామితో ఏమీ మాట్లాడకుండా మీ పని మీరు యాంత్రికంగా చేసేయకండి.

మీ భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించండి:

సెక్సులో ఏ విధంగా పాల్గొంటే తనకు ఇష్టమనేది మీ భాగస్వామిని ముందుగా అడిగి తెలుసుకోండి. లైట్స్ ఆఫ్ చేయాలా, ఉంచాలా? ఏ భంగిమలో చేస్తే నీకు నచ్చుతుంది? తదితర అభిప్రాయాలను తెలుసుకోండి. మీ భాగస్వామి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా నేరుగా ఆ పనిలోకి వెళ్లిపోకండి. అలా అయితే మీరు ఆనందాన్ని పొందలేరు.

వేగంగా వద్దు.. నెమ్మదే ముద్దు:

చాలామంది సెక్సును అదొక పనిగా భావిస్తారు. అలా మీరెప్పుడు అనుకోవద్దు. సెక్స్ అనేది ఒక కళ. దాన్ని వేగంగా పూర్తి చేసేస్తే కిక్కే ఉండదు. చాలా నెమ్మదిగా.. ఫోర్‌ప్లే, ముద్దులతో రాపిడిలోని ఆనందాన్ని ఆస్వాదించండి. మీరు ఆ పని ఎంత స్లోగా చేస్తే.. అంతగా మీ భాగస్వామి ఆనందిస్తుందట.

అభినందించండి:

మీరు పురుషుడైనా, స్త్రీ అయినా.. మీ భాగస్వామి సెక్స్ సామర్థ్యాన్ని.. మెచ్చుకోవల్సిందే. ఏదైనా మంచి పని చేసినప్పుడు ఎలా అభినందనలు తెలుపుతామో.. అలా సెక్స్ సమయంలో కూడా మీ భాగస్వామిని ప్రశసించండి. మీ కాంప్లిమెంట్స్.. భాగస్వామిలో మరింత ఉత్సాహాన్ని పెంచుతాయి. మళ్లీ మళ్లీ సెక్స్ చేసేందుకు మార్గాన్ని సులభం చేస్తాయి.