IPL Auction 2025 Live

Tips For Women: మీ పిల్లవాడు అదే పనిగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నాడా..అయితే ఈ అలవాటు మాన్పించాలంటే టిప్స్ మీ కోసం

తల్లిదండ్రులకు కూడా తమకు సమయం దొరుకుతుందనే ఆశతో పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు.ఫలితంగా చిన్నారుల మానసిక వికాసంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Kids Screen Time. (Photo Credits: Pixabay)

ఈ రోజుల్లో పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించడం అనేది సర్వ సాధారణమైంది. తల్లిదండ్రులకు కూడా తమకు సమయం దొరుకుతుందనే ఆశతో పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా చిన్నారుల మానసిక వికాసంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్న పిల్లలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వాళ్లు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు.

అంతేకాదు ఫోన్ లేదా టీవి చూసుకుంటూ తింటే..తినవాల్సిన దానికన్నా ఎక్కువ తినేస్తారు. అందువలన భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వీటి నుంచి తప్పించుకోవాలంటే పిల్లల్ని స్మార్ట్ ఫోన్ వాడకుండా చూడాలి. అవేంటో తెలుసుకుందామా..

>> పిల్లల మనసు చాలా సునితం. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారో చూసి వాళ్లు కూడా అదే అలవాటు చేసుకుంటారు. కనుక ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, పెద్దలు స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ వంటివి చూడొద్దని గుర్తుంచుకోవాలి.

>> పిల్లలకు ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే, వాళ్లు ఆకలిగా అని చెప్పినప్పుడు మాత్రమే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అల్లరి చేయకుండా.. ఫోన్ అనే ఆలోచన రాకుండా తిండి పైనే మనసు పెట్టి తింటారు.

> పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుకుంటూ ఉండండి. కూరగాయలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకోండి. నవ్వుతూ.. కబుర్లు చెబుతూ, జోకులేసుకుంటూ తినిపిస్తే.. మొబైల్ ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన పని ఉండదు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిక్కులో అద్దం పెడితే, అశుభం జరగడం

>> చిన్నప్పటి నుంచే పిల్లలకి బుక్ చదివే అలవాటు చేయాలి. ముందుగా బొమ్మల పుస్తకాలతో మొదలు పెట్టాలి. తర్వాత పజిల్స్ చేయడం.. కథల పుస్తకాలు చదవడం.. అలాగే పేపర్లలో వచ్చే కథనాలను చదివించడం అలవాటు చేస్తే.. మొబైల్ ఫోన్ మీదకి దృష్టి వెళ్లకుండా ఉంటుంది.

>> చిన్నపిల్లలకి బాల్యం నుంచే చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆడుకోవడం అలవాటు చేయాలి. చుట్టుపక్కల వారు మీ పిల్లల వయస్సుదగ్గ లేకపోతే.. మీరే వారితో ఆడుకోండి. కొంచెంసేపు బయట ఆడిపించే ఆటలు, ఇంకొంచెం సేపు క్యారమ్స్, చెస్ వంటివి ఆడడం అలవాటు చేస్తే మొబైల్ ఫోన్ బారిన పడకుండా ఉంటారు.