Side Effects on Drinking Coconut Water: కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోవడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే..

అలాగే జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు.

Representative Image (Photo Credits: File Photo)

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తీసుకుంటుంటారు. అలాగే అలసినట్టుగా అనిపించినప్పుడు కూడా వీటిని తీసుకుంటారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. రెగ్యూలర్‏గా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. రోజూ కొబ్బరి నీళ్లు తాగితే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే… అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. జీవక్రియ రేటు పెరగడమే కాకుండా.. బరువు తగ్గుతారు. ఇందులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇవే కాకుండా.. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కొబ్బరి నీళ్లలో ఉన్నాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తీసుకుంటే ప్రమాదం.

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాకుండా…ఇతర సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. అంతేకాకుండా విరేచనాలు కలుగుతాయి.

Kashi Vishwanath Corridor: కాశీలో ప్ర‌తి రాయి శివుడే.. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అంద‌రికీ కాశీ విశ్వ‌నాథుడి ఆశీస్సులు ఉండాలన్న భారత ప్రధాని

కొందరికి ప్రతిసారి జలుబు చేస్తుంటుంది. వీరు చల్లటి పదర్థాలు తింటే జలుబు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సందర్బంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. వాస్తవానికి కొబ్బరి నీళ్ల ప్రభావం చల్లగా ఉంటుంది. దీంతో జలుబు సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ఇక అధిక రక్తపోటుకు మందులు వాడేవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. దీనివలన మీకు తక్కువ రక్తపోటు సమస్య కలుగుతుంది.

పొట్ట ఉబ్బరం సమస్యతో బాధపడేవారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే ముందుగా వైద్యుడి సలహాలు తీసుకోవాలి. దీంతోపాటు.. ఏదైనా శస్త్రచికిత్స జరిగిన తర్వాత శస్త్రచికిత్స తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం మానుకోవాలి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సమస్యలు కలిగిస్తుంది.