Image used for representational purposes only (Photo Credits: Pixabay)

మంచినీరు పరగడుపున తాగటం వల్ల ఆరోగ్యపరంగా చేకూరే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ఎన్నో అనారోగ్య సమస్యలను పరగడుపున నీరు తాగటం వల్ల నివారించుకోవచ్చు. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు సైతం స్ఫష్టంగా చెబుతున్నారు. నిద్రలేవగానే ఒకటిన్నర లీటరు మంచినీటిని తీసుకోవాలి. మంచి నీరు తాగిన గంట సేపటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీరు తాగటం వల్ల పెద్ద పేగు శుభ్రపడుతుంది. అంతేకాకుండా శరీరం మరిన్ని పోషకాలను గ్రహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా చేయటం వల్ల శరీరంలో కొత్త రక్తం తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కండరాల కణాలు వృద్ధికి దోహదపడుతుంది. ఉదయాన్నే కనీసం అరలీటరు నీటిని తాగటం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల సులభంగా బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది.

షాకిస్తున్న క్రిప్టోకరెన్సీ రొమాన్స్‌ స్కాం, గత 5 ఏళ్లలో $1.3 బిలియన్లను కోల్పోయిన రసికులు, డేటింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్‌లో ఇరుక్కున్న పలువురు..

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే పరగడుపున లీటరున్నర మంచినీటిని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నెలరోజుల్లోనే వారి బరువు తగ్గుదలలో మార్పును స్ఫష్టంగా గమనించ వచ్చు. పరగడుపున నీరు తాగటం వల్ల రక్త కణాలు శుద్ధి చేయబడతాయి. రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. చర్మం కాంతి వంతంగా తయారయ్యేందుకు ఉపకరిస్తుంది. శ్వేత గంధ్రుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఎలాంటి ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మలవిసర్జన సాఫీగా ఉంటుంది.

శరీరంలో కాలరీలు కరిగించటంలో సైతం తాగునీరు ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో తేలింది. నీరు తాగటం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఆహారం మితంగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. శరీరంలో అధికంగా ఉన్న వేడి తొలగించుకునేందుకు పరగడుపున నీటిని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు.



సంబంధిత వార్తలు

Delhi Water Crisis: నీటి విడుదలకు ససేమిరా అంటున్న హరియాణా. నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా కట్టాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు

Woman Protest At Flood Water: రోడ్ల‌న్నీ గుంత‌లు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ మ‌హిళ ఏం చేసిందో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండ‌రు!

Health Tips: ఉదయాన్నే చిటెకెడు ఉప్పు వేసుకుని మంచి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు, అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు మాత్రం దూరంగా ఉండండి

Uttar Pradesh Horror: వివాహేతర సంబంధం అనుమానం, అర్థరాత్రి భర్త పురుషాంగంతో పాటు శరీరంపై వేడి నీళ్లు పోసిన భార్య, మేడ మీద నుంచి తోసేసిన బావ

Delhi CM Arvind Kejriwal: జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈడీ కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్

Bengaluru Water Crisis: నీటి సంక్షోభంతో బెంగుళూరును వదిలేస్తున్న టెకీలు, సొంతూరు నుంచి వర్క్ ఫ్రం హోం చేసే దిశగా ఆలోచనలు, నగరంలో తీవ్రమయిన నీటి కొరత

Water Crisis in Karnataka: కర్ణాటకలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభం, కఠిన నిబంధనలు అమల్లోకి..ఉల్లంఘిస్తే రూ. 5 వేలు జరిమానా

Bengaluru Water Crisis: బెంగుళూరులో నీటి సంక్షోభం, కారు వాషింగ్, స్విమ్మింగ్ పూల్స్‌పై నిషేధం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేస్తామని తెలిపిన ప్రభుత్వం