Health Benefits of Mint: జలుబు, గొంతునొప్పికి దివ్వౌషదం పుదీనా, కరోనా సైడ్ ఎఫెక్ట్స్ ఇలా పోగొట్టుకోవచ్చు, పుదీనాతో రోజూ ఇలా చేయండి చాలు చక్కటి ఆరోగ్యం మీ సొంతం
తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి (Health benefits of mint) ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం (Calcium), ఫాస్ఫరస్ మూలకాలు, సీ, డీ, ఈ, బీ విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి.
Hyderabad January 29: పుదీనా (Mint)తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి (Health benefits of mint) ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం (Calcium), ఫాస్ఫరస్ మూలకాలు, సీ, డీ, ఈ, బీ విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. మరి ఆరోగ్యపరంగా పుదీనాతో ఎన్ని లాభాలున్నాయో ఒకసారి తెలుసుకుందామా..?
పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడంవల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
శ్వాస సంబంధమైన సమస్యలకు కూడా పుదీనా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి, దాంట్లో నాలుగైదు చుక్కల పుదీనా (Mint Oil) నూనె వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
పుదీనా అలర్జీ(Allergy), ఉబ్బసం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో ఉపయోగించాలి. అదేవిధంగా అచ్చం పుదీనాను పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు.
పుదీనా టీ (Mint Tea) తాగడం ద్వారా జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది.
ఇక పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పుదీనా ఆకులను తరచూ నమలడంవల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.