Relation Tips: నా యోని లూజుగా ఉందని నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు..నేను ఏం చేయాలి..?
సాధారణంగా స్త్రీలు శారీరక శ్రమ ఎక్కువగా చేయడం, బస్సులు ఎక్కడము, సైకిల్ తొక్కడము, పరిగెత్తడము ఇతర శారీరక శ్రమ ద్వారా, కన్నెపొర అనేది చిన్న వయస్సులోనే తొలగిపోతోంది.
ప్రశ్న: నా పేరు సుజాత నా వయసు 26 సంవత్సరాలు మాకు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూడా నాకు నా భర్తకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. తొలిరాత్రి నా భర్త నాతో శృంగారం చేసిన అనంతరం నా యోని లూజుగా ఉందని, గతంలో మరో పురుషుడితో ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని నిడదీస్తున్నాడు. అయితే నాకు ఎలాంటి పాపము తెలియదు నేను పెళ్ళికి ముందు ఎవరితోనూ సెక్స్ చేయలేదు. నా యోని లూజుగా ఎందుకు ఉందో అర్థం కావడం లేదు. నేను ఎంత చెప్పినా నా భర్త వినడం లేదు ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి
సమాధానం: మీరు చెబుతున్న సమస్య చాలా క్లిష్టమైనది అయితే మీ భర్త అనుమానానికి అర్థం లేదు మీ యొక్క యోనిని బట్టి ఆమె షీలవత కాదా అన్న సంగతి గుర్తించడం దాదాపు అసాధ్యం. . చాలామంది యువతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. గతంలో యోని లోపల కన్నె పొర విషయంలో కూడా చాలామంది స్త్రీలు ఈ విధంగానే అనుమానంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజానికి యోని లూజుగా ఉండటం, కన్నెపొర లేకపోవడం అనేది సర్వసాధారణం. సాధారణంగా స్త్రీలు శారీరక శ్రమ ఎక్కువగా చేయడం, బస్సులు ఎక్కడము, సైకిల్ తొక్కడము, పరిగెత్తడము ఇతర శారీరక శ్రమ ద్వారా, కన్నెపొర అనేది చిన్న వయస్సులోనే తొలగిపోతోంది. ఇక యోని లూజుగా ఉందనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. నిజానికి ఒక స్త్రీ యోని లూజుగా ఉండటం అనేది ఉండదు. బహుశా పురుషుడి భావన కూడా ఇందులో ప్రధాన కారణంగా ఉంటుంది. సాధారణంగా పురుషుల్లో చాలామంది బూతు చిత్రాల్లో చూసి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. వాటిని చూడటం ద్వారా సంతృప్తి పొందుతూ ఉంటారు. అలాగే కొంతమంది పురుషులు హస్తప్రయోగానికి అలవాటు పడతారు. వీటివల్ల సాధారణంగా జరిగే శృంగార ప్రక్రియ వారికి భావప్రాప్తిని ఇవ్వదు. ఫలితంగా యోని లూజుగా ఉందని, భావప్రాప్తి దక్కడం లేదని ఇలా చెబుతూ ఉంటారు. అయితే నిజానికి ఇవన్నీ కూడా అపోహలే. మీ భర్తను మీరు వెంటనే ఓ సైకలాజికల్ కౌన్సిలర్ వద్దకు తీసుకొని వెళ్ళండి అప్పుడు ఆయన అనుమానాలన్నీ పటాపంచాలు అవుతాయి. లేదా సెక్స్ నిపుణులు వద్దకు మీ భర్తను తీసుకెళ్లి ఆయన సందేహాలకు సమాధానం ఇప్పివ్వండి అప్పుడు మీ సమస్య పరిష్కారం అవుతుంది.