New Coronavirus Strain: ఈ లక్షణాలు ఉంటే మీకు కొత్త రకం కరోనా వచ్చినట్లే, సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న రోగుల సంఖ్య, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్
అలాగే డాక్టర్లు కూడా కొన్ని సలహాలను ఇచ్చారు. సాధారణంగా కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇవి తొలి దశలో వచ్చిన కరోనా లక్షణాలు..
New Delhi, April 7: దేశంలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. గత వారం రోజుల నుంచి భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఏకంగా రోజు వారీ కేసులు లక్ష దాటుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అప్పుడే ఫోర్త్ వేవ్ స్టార్టయింది. అయితే కొత్త కరోనా వైరస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలనే దానిపై కేంద్రం కొన్ని సూచలను తెలిపింది. అలాగే డాక్టర్లు కూడా కొన్ని సలహాలను ఇచ్చారు. సాధారణంగా కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇవి తొలి దశలో వచ్చిన కరోనా లక్షణాలు..
ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు (New Coronavirus Strain) కనిపిస్తున్నాయి. మరణాల రేటు తక్కువగానే ఉన్నా ఈసారి కరోనా (Coronavirus Strain) వల్ల ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ వైరస్ (COVID strain) సోకిన వారిలో పొత్తికడుపులో నొప్పి, వాంతులు, వికారం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం వంటి కొత్త లక్షణాలను గుర్తించారు. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏసీఈ2 గ్రాహకాలకు అతుక్కుని వైరస్ తన సంఖ్యను పెంచుకుంటోందన్నారు. ఈ లక్షణాలు కనిపించినవారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు లేకపోవడాన్ని గమనించారు.
అయితే మొదటి వేవ్‌లో (Covid first Wave) కోవిడ్ సోకిన వారిలో చాలా మందిలో ఇలాంటి లక్షణాలూ ఏవీ కనిపించలేదు. కొందరిలో కొద్దిపాటి లక్షణాలు మాత్రం కనిపించాయి. అతి తక్కువ మందికి సీరియస్ అయినా బతికి బయటపడ్డారు. కానీ సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రతరం అవుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 50 వేల నుంచి 97 వేలకు చేరడానికి గతేడాది కొన్ని నెలలు పడితే ఈసారి రోజువారీ కేసుల సంఖ్య కొన్ని రోజుల్లోనే లక్ష దాటేశాయి.
బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బ్రిటన్ వేరియంట్ల వల్ల వైర్‌స్లో జరుగుతున్న ఉత్పరివర్తనాల వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత బాగా పెరుగుతోందని వైద్యనిపుణులు అంటున్నారు. వైరస్ మరింత శక్తిమంతంగా మారి సోకినవారిలో కొత్త లక్షణాలకు కారణమవుతోందని, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తోందని చెప్పారు. కాగా బీపీ, షుగర్, హృద్రోగాల వంటివి ఉన్నవారిలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటోంది. ఈ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
ఇదిలా ఉంటే గతేడాది చివరి నుంచి చాలామంది మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఫలితంగా కేసుల సంఖ్య కిందటి ఏడాది నాటి పతాకస్థాయిని దాటింది. ఈసారి వైరస్ సోకినవారిలో వైరల్‌లోడ్ ఎక్కువగా ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. వైరల్ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే వారి నుంచి ఇతరులకు సోకే ముప్పు అంత ఎక్కువ. కాగా, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న పలువురి మెదడులో రక్తం గడ్డ కట్టిన దుష్ప్రభావానికి టీకాతో సంబంధం ఉండొచ్చని ఐరోపా ఔషధ ఏజెన్సీ, వ్యాక్సిన్ అధ్యయన బృంద సారథి మార్కో కవలెరీ అభిప్రాయపడ్డారు.
చిన్నసైజు గదుల్లో ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే.. భౌతిక దూరం కంటే మాస్కులు ధరించడం చాలా ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలు ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 9 అడుగుల ఎత్తు, 709 చదరపు అడుగుల వైశాల్యమున్న రెండు తరగతి గదులను ఈ పరిశోధన కోసం సృష్టించారు. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా స్కూళ్లు, వ్యాపార కార్యాలయాల్లో మాస్కుధారణ తప్పనిసరిగా పేర్కొంటూ... దూరాన్ని మాత్రం 3 అడుగులకు తగ్గించింది.