Relation Tips: నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది, చాలా రోజులుగా పడక సుఖం లేదు, అనుకోకుండా బావగారితో లైంగిక కోరిక తీర్చుకున్నా...తప్పు జరిగిపోయింది ఇప్పుడేం చేయాలి..

అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటన తర్వాత ఇద్దరిలోనూ పశ్చాత్తాపం నెలకొని ఉంది.

Representational Purpose Only (Photo Credits: Pexels)

ప్రశ్న: నా పేరు పింకీ ( పేరు మార్చాం) నా వయస్సు 36 సంవత్సరాలు...నా భర్త ఉద్యోగరీత్యా దుబాయిలో పనిచేసేవాడు. అక్కడ యాక్సిడెంట్ కావడంతో కాలు విరిగి వికలాంగుడిగా మారిపోయాడు. దీంతో మా జీవితం తల్లకిందులు అయిపోయింది. సంపాదించాల్సిన భర్త ఇంటికే మంచానికే పరిమితం అయ్యాడు. మాకు ఒక బాబు ఉన్నాడు. గడిచిన 3 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి మా పుట్టింటి వారు పంపిస్తున్న ధాన్యం డబ్బులతో ఇల్లు గడుస్తోంది. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర ఉండే ఓ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాను. అయితే మాకు ఆర్థికంగా సహాయం చేసేందుకు అప్పుడప్పుడు నా సోదరి భర్త అయిన బావగారు ముందుకు వస్తుండేవారు. ఆయన చాలా మంచి మనిషి...మా కష్టాలను చూసి ఎప్పటికప్పుడు స్పందించేవారు. వారి పిల్లలతో సమానంగా మా బాబును కూడా చూసేవాడు. ఆయనకు సమాజంలో కాస్త పరపతి ఉండటంతో నాకు ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చారు. అయితే సరిగ్గా అలాంటి సందర్భంలోనే ఓ అనుకోని సంఘటన మా జీవితాన్ని కుంగదీసింది. ఓ రోజు నేను మా బావగారికి నా కష్టాల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాను. చిన్న వయస్సులో వచ్చిన కష్టాలను తట్టుకునే శక్తి ఎలా వస్తుంది అని చాలా బాధపడి ఆయనను చాలా గాఢంగా హత్తుకొని వదలలేకపోయాను. దీంతో ఆయన కూడా ఓదార్చే క్రమంలో, నన్ను వారించలేకపోయారు. ఆ బలహీన క్షణంలో ఇద్దరం శారీరకంగా దగ్గరయ్యాం. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటన తర్వాత ఇద్దరిలోనూ పశ్చాత్తాపం నెలకొని ఉంది. మా బావగారు నాతో మాట్లాడటం మానేశారు. జరిగిన ఘటనలో నాతప్పు కూడా వంద శాతం ఉంది. అందుకు నేను ఆయన క్షమాపణ చెప్పాలని ఉంది. దీనికి పరిష్కారం చూపండి..

Relation Tips: నా యోనిలో అంగం చొప్పించి స్ఖలించిన తర్వాత.. 

జవాబు..మీ విషయంలో జరిగింది. ఒక అనుకోని సంఘటన...చట్ట ప్రకారం చూస్తే మీరు చేసింది. నేరం కాదు.. శారీరకంగా దగ్గరవ్వడం అనేది ఇద్దరు వ్యక్తుల పరస్పర అంగీకారాన్ని బట్టి ఉంటుంది. అయితే మీ విషయంలో మీ బావగారు కూడా పూర్తి అంగీకారంతోనే మీతో దగ్గరయ్యారు. ఇద్దరిలోనూ అపరాధ భావం గూడుకట్టుకొని ఉంది. అందుకే ఇద్దరిలోనూ ఎలాంటి దురుద్దేశాలు లేవనే సంగతి తెలుస్తోంది. మరొక అంశం మీరిద్దరూ గుర్తించాలి. ఇద్దరు వేరు వేరు కుటుంబాలకు చెందిన వారు. మన సమాజంలో ఉన్న కట్టుబాట్ల దృష్ట్యా మీ బంధాన్ని కొనసాగించలేరు. మీ చర్యలు మీ సోదరి జీవితాన్ని సైతం అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. అయితే మీరు చేయాల్సిన పని ఒకటుంది. మీ పశ్చాత్తాపాన్ని మీ బావగారికి తెలిపేందుకు ప్రయత్నించండి. మీలో తప్పు చేసిన భావన ఉంటే చాలా మంచిది. కాలాన్ని వెనక్కు తేలేము. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీ బావగారితో శారీరక సంబంధం గురించి మర్చిపోయేందుకు ప్రయత్నించండి. అదే ఈ సమస్యకు పరిష్కారం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రయత్నం చేయండి. మీ పిల్లవాడి భవిష్యత్తు కోసం మీ సమయాన్ని కేటాయించండి. మనస్సులోని నెగిటివ్ భావనలను పక్కకు పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించండి.