Diabetes Samosa Link: మనం ఇష్టంగా తినే సమోసా, పకోడాతో మధుమేహం సమస్య.. ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
భారతీయులు ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
Newdelhi, Oct 8: భారతీయులు (Indians Food) ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి (Diabetes) కారణం అవుతున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్న 25-45 ఏండ్లకు చెందిన 38 మంది వయస్కులను పరీక్షించగా వారిలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23 కంటే అధికంగా ఉన్నదని తెలిసింది. వీళ్ళందరూ మధుమేహంతో బాధపడుతున్నట్టు రుజువైంది. వీళ్లు సమోసా, పకోడా వంటి ఆహారాన్ని ఎక్కువగా తింటున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధ్యయనం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైంది.
వీటితోనే మధుమేహం సమస్య
- సమోసా
- పకోడా
- ఫ్రైడ్ చికెన్
- చిప్స్
- బిస్కెట్లు
- కేక్స్
- రెడీమేడ్ మీల్స్
- మయోనైజ్
- గ్రిల్ చికెన్
- బీఫ్
- డ్రై నట్స్
- వేయించిన వాల్ నట్స్