Headaches: తలనొప్పికి తక్షణం ఉపశమనం కలిగించే చిట్కాలు, మీరు తాత్కాలిక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే వీటిని ఆచరించి చూడమంటున్న నిపుణులు
ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య. పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనకు తలనొప్పి (Headaches) వస్తుండడం సహజం. ఇక వేసవిలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే తలనొప్పి కచ్చితంగా వస్తుంది. అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మనకు తలనొప్పి వస్తుంటుంది.
తలనొప్పి.. ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య. పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనకు తలనొప్పి (Headaches) వస్తుండడం సహజం. ఇక వేసవిలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే తలనొప్పి కచ్చితంగా వస్తుంది. అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మనకు తలనొప్పి వస్తుంటుంది. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది మందులు వేసుకుంటారు. అయితే, పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
తలనొప్పుల్లో 200 పైగా రకాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని ప్రాణాంతకమైన తలనొప్పులూ ఉన్నాయి. వెంటనే తగ్గిపోయే సాధారణ తలనొప్పులు కూడా ఉన్నాయి. తల, మెడ భాగాల్లోని తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు, లేదా తలలోని రక్త నాళాలు ఒత్తిడికి లోనుకావడం లేదా వాపు వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే, తరచుగా తలనొప్పి వస్తున్నట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే.. తలనొప్పి ఎన్నో రకాల సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ఇది సున్నితమైన రక్తనాళలు, మెదడుకు సంబంధించిన సమస్య. కాబట్టి.. అస్సలు అజాగ్రత్త వద్దు. సాధారణంగా వచ్చే తలనొప్పుల నుంచి తక్షణం ఉపశమనం పొందాలంటే (Natural Ways to Prevent and Treat Headaches) ఈ కింది చిట్కాలను పాటించండి.
జామపండుతో అనేక వ్యాధులు దూరం, రోజుకు ఒక్క జామ కాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం
ఎండలో తిరగాల్సి వస్తే తలకు టోపీ, క్యాప్ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి కూడా చుట్టుకోవచ్చు. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా (headache relief pressure points) ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల వచ్చిన తలనొప్పి అయితే కొంత సేపు చల్లని నీడలో ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. చల్లని ప్రదేశంలో ఉండి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. కంళ్లను బాగా కడగాలి. దీని వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. రిలాక్స్ అయిన భావన కలిగి తలనొప్పి తగ్గుతుంది.
నీటిని తగినంత తాగకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా ( how to reduce stress headache) చూసుకోవచ్చు. చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇతర సహజ సిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. వట్టివేరుతో చల్లని పానీయం తయారు చేసుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. అరటి పండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
మీ ఇంట్లో చందనం పౌడర్ ఉన్నట్లయితే.. పేస్టులా చేసుకుని తలకు రాసుకోండి.టీ లేదా మాంచి కాఫీని తాగడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.అల్లాన్ని నమిలినా సరే తలనొప్పి తగ్గుతుంది.తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో.. కాంతి తక్కువగా ఉండే ప్రాంతంలో విశ్రాంతి తీసుకోండి.
కొద్దిగా వెల్లులిని తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నూనె చాలాబాగా పనిచేస్తుంది. దీన్ని కాస్త నడి నెత్తి మీద వేసుకుని మర్దనా చేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. మంచి నిద్ర, వ్యాయమం తలనొప్పిని దరిచేరకుండా మిమ్మల్ని రక్షిస్తాయి. ఇవన్నీ సాధారణంగా వచ్చే తల నొప్పులకు ఉపశమనాలు. తలనొప్పి భారీగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.