Sore Throat (Photo Credits: Pixabay)

మీరు గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వంటి వాటితో బాధపడుతున్నారా..అయితే వీటికి మీరు ఇంటిలోనే కొన్ని చిట్కాలు (Home Remedies) పాటించడం ద్వారా తరిమికొట్టవచ్చు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ అండ్‌ క్రానియోఫేషియల్‌ రీసెర్చ్‌ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో చికాకు, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలుగా తేల్చింది.

ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం, మౌత్ వాష్ లు ఉపయోగించడం ద్వారా కొంతమంది లో ఈ సమస్య నివారించపడుతుంది. ఇలా చేసినప్పటికీ నోటి దుర్వాసన (Bad Breath) తగ్గక పొతే మాత్రం తప్పనిసరిగా శరీరంలోని ఇతర సమస్యలకు సంకేతంగా భావించవచ్చని అంటున్నారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కూడా కొన్నిసార్లు నోటి దుర్వాసన సమస్యకు కారణమవుతాయి. డయాబెటిస్ సమస్యతో బాధ పడేవాళ్లకు నోటి నుంచి కుళ్లిపోయిన పండ్ల వాసన వస్తుంది. లివర్ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు నోటి నుంచి కుళ్లిపోయిన గుడ్ల వంటి వాసన వస్తుంది.

ఊపిరితిత్తులకు కరోనా సోకిందని ఎలా గుర్తించాలి, లంగ్స్ మీద కోవిడ్ ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం

కొంతమంది నోటి దుర్వాసన ఇతరులకు తెలియకుండా ఉండేందుకు వక్కలు, కిళ్లీలను ఆశ్రయిస్తారు. వీటిని తరచుగా నములుతుంటారు. అయితే ఇవి.. సమస్యను మరింత తీవ్రం చేస్తాయని అంటున్నారు. ఎక్కువ రోజులు నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డాక్టర్ పరీక్షించి నోటి దుర్వాసనకు గల కారణాలను తెల్సుకుని సరైన చికిత్సను అందిస్తారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను నిపుణులు చెబుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ నుంచి ఐదు నెలలే రక్షణ, ఆ తర్వాత దాని ప్రభావం క్షీణిస్తోందని తెలిపిన బ్రిటన్ పరిశోధకులు, బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు రెడీ అవుతున్న బ్రిటన్

తులసి, తేనెలతో టీ

పూర్వం నుంచే మన ఆయుర్వేద శాస్త్రంలో తులసి, తేనెలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి అందించే సహజసిద్ధమైన తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటి ఫంగల్‌ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. అలాగే తులసిలో కూడా ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంటి వైద్యం, నాటు వైద్యాలలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి, తేనెలతో తయారు చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు కలిపిన పాలు

పొడి గొంతు సమస్యలకు, దగ్గు సంబంధిత రుగ్మతలకు ఇది బాగా పనిచేస్తుంది. పసుపును ఆహారంలో భాగంగా తీసు​కున్నట్టయితే వ్యాధుల బారి నుంచి కాపాడటమేకాక, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

నెయ్యితో మిరియాల పొడి

యాంటీ బ్యాక్టీరియల్‌ (సూక్ష్మజీవుల వినాశక), యాంటీ ఫంగల్‌ (తాపనివారక) లక్షణాలు నెయ్యిలో అధికంగా ఉంటాయి. ఒక టేబుల్‌ స్ఫూన్‌ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తినండి. గొంతు తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీనిని తిన్నతర్వాత ఏ విధమైన పానియాలు తాగకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ములేథి లేదా లికోరైస్‌ మూలిక చూర్ణం

లికోరైస్‌ అనేది ఒక​ ఆయుర్వేద మూలిక. ఈ ఔషధ మొక్క రుచి తియ్యగా ఉండటం వల్ల దీనిని అతిమధురం అని కూడా అంటారు. ఈ మూలికను చిన్న ముక్కగా తుంచి, నోట్లో వేసుకుని నమలడం వల్ల రోజంతా గొంతును తడిగా ఉంచుతుంది. సాధారణంగా దీనిని శ్వాస, పేగు సంబంధిత రుగ్మతల నివారణకు వినియోగిస్తారు.

ఉప్పునీరు

పొడి గొంతు సమస్య నివారణకు తేలికైన, అత్యంత ప్రభావవంతమైన మరొక పద్ధతి ఉప్పు నీటి పుక్కిలింత. వేడి నీటిలో ఉప్పు కలిపి రోజుకి కనీసం రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని కరిగించి పలచబరుస్తుంది. తక్షణ ఉపశమనానికి ఇది చక్కని మార్గం.

హెర్బల్‌ టీ

కాలుష్యం, దుమ్మూ ధూళి వల్ల గొంతులో చికాకుపుట్టించే సమస్యలకు శ్రేష్ఠమైన పరిష్కారం హెర్బల్‌ టీ. వీటివల్ల ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి సమాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల కాలుష్యకారకాలైన ధూళికణాలు ఆరోగ్యానికి హాని తలపెట్టకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది.

మెంతుల డికాషన్‌

వివిధ రకాల గొంతు రుగ్మతలను నివారించడంతోపాటు, పలు ఆరోగ్య సమస్యల నివారణలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంతవరకు ఉడికించాలి. అనంతరం ఈ డికాషన్‌ను చల్లార్చి, రోజుకు రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారడం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.