Relationship: బంధం గట్టిపడాలంటే భార్యాభర్తల మధ్య శృంగారం చాలా ముఖ్యం, జీవితంలో శృంగారం ఎంత ముఖ్యమో,వైద్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి
భార్యాభర్తల జీవితంలో ప్రేమ, అనురాగం మాత్రమే కాకుండా వారిద్దరి మధ్య జరిగే శృంగారం కూడా ఎంతో ముఖ్యమైంది
భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా ఉండాలంటే శృంగారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర. భార్యాభర్తల జీవితంలో ప్రేమ, అనురాగం మాత్రమే కాకుండా వారిద్దరి మధ్య జరిగే శృంగారం కూడా ఎంతో ముఖ్యమైంది. ఆ విషయంలో వారిద్దరు ఎంత సుఖంగా ఉంటే వారి దాంపత్య జీవితం (husband and wife love relationship) అంత హాయిగా కొనసాగుతోంది. అయితే నిపుణులు చెబుతున్న విషయం ప్రకారం శృంగారం (Wife and husband relationship ideas) కారణంగా మనకు తెలియని ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
శృంగార సామర్థ్యానికి అనేక శారీరక మానసిక కారణాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా భాగస్వామిపై తీవ్రమైన ఆకర్షణ ఉండాలి. ప్రేమ, ఇష్టం, భాగస్వామి సహాయ సహకారాలు, ప్రేరణ, ఉత్సాహం, ఆరోగ్యం అవసరం. అవకాశం, పరిసరాలు, పరిస్థితులు ఇటువంటి అనేక అంశాలు రతి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పురుషుల్లో యవ్వనం తొలి రోజుల్లో ఆ వాంఛ చాలా తీవ్రంగా ఉంటుంది. రతిని నిర్వహించే శక్తి కూడా ఊహకు మించి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని కొన్ని రకాలైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఏడు పదుల వయస్సు వరకు కాపాడుకోవచ్చని అంటున్నారు. తద్వారా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చని చెపుతున్నారు. ఆకలి, దాహం ఎలాంటివో సెక్స్ కూడా అటువంటిదేనని అంటున్నారు. సెక్స్‌ను అపవిత్రంగా ఎప్పుడూ భావించకూడదంటున్నారు. అయితే, ఈ సెక్స్‌లో మహిళల సహకారం ఎంతో ముఖ్యమనేది మరువకూడదు.
ముఖ్యంగా రాత్రివేళలో చేసే శృంగారం కంటే, తెల్లవారు జామున చేసే శృంగారం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే లేచి జిమ్ ల వెంట కాకుండా పడకగదిలో మీ పార్ట్నర్ తో శృంగారం జరిపితే ఆ కేలరీలు ఇక్కడే కరిగిచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.అంతేకాదు శృంగారం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే యోగా చేయడం, నడవడం ద్వారా కూడా శృంగారంలో పాల్గొన్న తర్వాత చాలా ఎక్కువ క్యాలరీస్ కరుగుతాయి.
ప్రస్తుత జీవితంలో పని ఒత్తిడి కారణంగా ప్రశాంతంగా నిద్ర పోవాలని చాలామంది అనుకుంటారు. కాకపోతే పని ఒత్తిడి మానసిక ఆలోచన ద్వారా సుఖ నిద్రకు చాలామంది దూరమవుతున్నారు. అయితే ఈ విషయానికి భార్యాభర్తల నడుమ శృంగారం జరిగితే సుఖంగా నిద్రపోవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. శృంగారం చేసిన తర్వాత శరీరమంతా రిలాక్స్ మూడ్ లోకి వెళ్లి పోతుంది కాబట్టి, మీరు వద్దనుకున్న నిద్రమత్తులోకి అతి సులభంగా జారుకుంటారు. ఇకపోతే భార్యాభర్తలు వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువగా శృంగారంలో పాల్గొంటే శరీరం లోకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట నిపుణులు తెలుపుతున్నారు.
శృంగార సమయంలో కొన్ని యాంటీబాడీస్ వారి శరీరంలో తయారవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటివల్ల తరచూ వచ్చే జలుబు దగ్గు లాంటి కొన్ని వైరస్ సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరవని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాదు శృంగార పరంగా యాక్టివ్ గా ఉండేవారు ఎక్కువ కాలం యవ్వనంగా కనబడతారని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని దీర్ఘకాలిక సామాజిక సమస్యలపై కూడా శృంగారం ఎంతగానో ప్రభావితం చూపిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.