How To Make Sex More Interesting? (Photo Credits: Pixabay)

సెక్స్ చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బంధం బలపడుతుంది. సెక్స్ గురించి చాలా మందికి రకరకాల ఫాంటసీలు ఉంటాయి. యోని , పురుషాంగం కలిసినప్పుడు రెండింటి నుంచి సహజంగా స్రవాలు విడుదల కాకపోతే, యోనిలో ఒరిపిడికి, ఇద్దరికీ మంట పుడుతుంది. అప్పుడు మీ మూడ్ పాడయ్యే అవకాశం ఉంది. వయస్సు పెరిగే కొద్దీ ఇద్దరిలో లూబ్రికేషన్ తగ్గిపోతుంది. అయితే చాలా మంది బయట ఫార్మసీల్లో దొరికే లూబ్రికెంట్స్ వాడుతుంటారు. అయితే ఇవి శరీరానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మార్కెట్ లో దొరికే లూబ్రికెంట్స్ ప్రైవేట్ భాగాలకు హాని కలిగించే రసాయనాలను ఉపయోగిస్తాయి. కాబట్టి కృత్రిమమైన వాటికి బదులుగా సహజసిద్ధమైన లూబ్రికెంట్లను ఉపయోగించడం వల్ల లైంగిక ఆనందాన్ని పెంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

సహజ లూబ్రికెంట్లను ఉపయోగించడం చాలా సురక్షితం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి సంభోగం సమయంలో అధిక రాపిడి జరగకుండా నష్టాన్నినివారిస్తుంది. కాబట్టి నిపుణులు మార్కెట్ లోని లూబ్రికెంట్లకు బదులుగా సహజమైన లూబ్రికెంట్స్ వాడమని సిఫార్సు చేస్తారు.

కొబ్బరి నూనె అత్యంత ప్రాచుర్యం పొందిన సహజ లూబ్రికెంట్ అని నిపుణులు అంటున్నారు. ఈ కొబ్బరినూనె జననాంగాలకు ఎంతో మేలు చేస్తుంది. ఓరల్ సెక్స్ చేయాలనుకునే వారు ఈ కొబ్బరి నూనెను యోని లేదా పురుషాంగంపై సులభంగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ సువాసన సెక్స్‌ను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్ కూడా సహజ లూబ్రికెంట్ గా ఉంటుంది. ఓరల్ సెక్స్‌లో సురక్షితంగా ఉపయోగించవచ్చు.

అలోవెరా జెల్ కూడా సహజమైన లూబ్రికెంట్‌గా గొప్పగా పనిచేస్తుంది. సంభోగం సమయంలో యోని, అంగంపై రాసి ఉపయోగించినప్పుడు ఒరిపిడి వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. మీరు ఇంట్లో సహజమైన కలబందను కూడా ఉపయోగించవచ్చు.

మద్యం మత్తులో భార్యను వదిలేసి అత్తను దారుణంగా.. విడాకుల కోసం భార్య వేధిస్తుండటంతో సుత్తితో ఆమెను చంపబోయి అత్తను చంపేసిన అల్లుడు

కొబ్బరి నూనె , ఆలివ్ నూనెతో పాటు అవకాడో నూనెను సహజమైన లూబ్రికెంట్‌గా ఉపయోగించమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ నూనెను ఉపయోగించి సులభంగా ఓరల్ సెక్స్ చేయవచ్చు.

విటమిన్ ఇ ఆయిల్ సహజ లూబ్రికెంట్ గా కూడా పనిచేస్తుంది. అయితే దీన్ని ఉపయోగించే ముందు అది ఎంత మేలు చేస్తుందో ఖచ్చితంగా తెలుసుకుని, ఆపై దానిని లూబ్రికెంట్‌గా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్: ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనికి లేటెస్ట్‌లీ ధృవీకరించలేదు. ఇది వాస్తవమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు,