Early Dinner Good for Health: రాత్రి తొమ్మిదింటికి చేసే భోజనం.. ఆరింటికే చేసెయ్యండి.. గుండె జబ్బులు, డయాబెటిస్‌ మీ దగ్గరకు రానేరావు.. వైద్య నిపుణులు ఇదే చెప్తున్నారు మరి..!

రాత్రి 9 గంటలకు చేసే భోజనాన్ని సాయంత్రం ఆరింటికే పూర్తి చేయడం వల్ల గుండెపోటు, టైప్‌-2 డయాబెటిస్‌ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉండదని చెబుతున్నారు.

Dinner (Credits: X)

Newdelhi, July 13: రాత్రి త్వరగా భోజనం (Dinner) తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని బెంగళూరుకు చెందిన ఫోర్టీస్‌ దవాఖాన వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి 9 గంటలకు చేసే భోజనాన్ని సాయంత్రం ఆరింటికే పూర్తి చేయడం వల్ల గుండెపోటు (Heart Attacks), టైప్‌-2 డయాబెటిస్‌ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. దీనికి గల కారణాలను కూడా వాళ్లు వివరించారు. పడుకొన్నప్పుడు శరీరానికి ఎక్కువ శ్రమ ఉండదు. కాబట్టి, ఈజీగా జీర్ణం అవడానికి నిద్రపోయే ముందు తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలంటారు పెద్దలు. అయితే, ఆ ఆహారాన్ని కూడా నిద్రకు నాలుగైదు గంటల ముందుగానే తీసుకొంటే మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. దీనిద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇన్సులిన్‌ ఉత్పత్తి క్రమబద్ధం అవుతుంది. తద్వారా టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు ఉండదని పరిశోధకులు చెప్తున్నారు.

హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ సంస్థ సీఈఓను కిడ్నాప్ చేసిన కన్సల్టెన్సీ సిబ్బంది.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

గుండెజబ్బులు కూడా రావు

సాయంత్రం ఆరింటికే భోజనం ముగిస్తే.. రక్తపోటు వంటి గుండె జీవక్రియల మీద మెరుగైన ప్రభావాన్ని చూపించి గుండెజబ్బుల ముప్పు కూడా తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన‌, ఉక్క‌పోత నుంచి న‌గ‌ర‌వాసుల‌కు ఉప‌శ‌మ‌నం