Vastu Tips: ఈ పక్షి ఫోటోని మీ ఇంట్లో దక్షిణ దిక్కులో పెట్టండి, మీకు పట్టిన దరిద్రాలన్నీ మాయమై సుఖశాంతులు వస్తాయని చెబుతున్న వాస్తుశాస్త్రం
వాస్తుశాస్త్రంలో(Vastu Tips) ఫోనిక్స్ పక్షి ఫోటో గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంది.
పండితులు సూచించిన వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు పాజిటివ్‌నెస్ తీసుకొస్తే..మరికొన్ని నెగెటివ్ శక్తులకు కారణం అవుతుంటాయి. వాస్తుశాస్త్రంలో(Vastu Tips) ఫోనిక్స్ పక్షి ఫోటో గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంది. ఈ పక్షి ఫోటో (Phoenix bird) ఇంట్లో ప్రత్యేకమై దిశలో పెట్టుకుంటే..అంతా శుభం జరుగుతుందట. వాస్తుప్రకారం ఇంటి దక్షిణ దిశలో ఫోనిక్స్ పక్షి ఫోటో అమర్చడం శుభప్రదం. ఈ ఫోటోను ఇంట్లో అమర్చడం వల్ల పాజిటివ్ శక్తులు ప్రసరిస్తాయి. నెగెటివ్ శక్తులు దూరమౌతాయి. ఇంట్లోని లివింగ్ రూమ్‌లో దక్షిణ దిశలో అమర్చుకోవాలంటున్నారు వాస్తు పండితులు.
దీనివల్ల ఇంట్లో సభ్యులందరి దృష్టి ఈ ఫోటోపై పడి..ప్రయోజనాలు చేకూరుతాయి. ఫీనిక్స్ పక్షి అనేది అగ్ని, ప్రసిద్ధత, అభివృద్ధికి సంకేతమని చెబుతారు. అభివృద్ధి పథాన ఎదురయ్యే ఇబ్బందులు తొలగించడంలో, వాస్తు దోషాల్నించి విముక్తి చేయడంలో ఫీనిక్స్ పక్షి ఫోటో ఉపయోగపడుతుందని నమ్మకం. ఇంటి దక్షిణ దిశలో ఈ ఫోటో అమర్చడం చాలా లాభదాయకం. ఇంట్లో ఫీనిక్స్ పక్షి ఫోటో అమర్చడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసరిస్తుంది లేదా తిరిగొస్తుంది.
అటు ఇంట్లో కుటుంబసభ్యులకు కూడా ఎనర్జీ లభిస్తుంది. ఫీనిక్స్ పక్షిని విజయానికి ప్రతీకగా భావిస్తారు. అందులో ఇంట్లో అమర్చుకోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అగ్నిని ప్రాతినిధ్యం వహించే పక్షి కాబట్టి..వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని దూరం చేస్తుంది.