Reason Behind Ganapathi Bappa Morya: గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారో తెలుసా? ఈ పదం వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది! గణపతి బప్పా మోరియా వెనుకున్న అసలు కథ ఇదే!

సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధురాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది

(Photo Credits: File Image)

Hyderabad, AUG 31: వినాయకుడు పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపం. తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించేందుకు మార్గ నిర్దేశం చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి ప్రత్యేకతలు వినాయకుడిలో చాలా ఉన్నాయి. మహారాష్ట్రలోని (Maharastra) ఇప్పటి మోర్గాం ప్రాంతంలో జరిగిన కథ ఇది. పుణెకు 79 కిలోమీటర్ల దూరంలో బారమతీ తాలూకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్ర (Ugra). పిల్లలు లేనందువల్ల శౌనక మహాముని సూచనమేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయ్యింది.సూర్యుడి లాంటి వేడితో పిల్లవాడు జన్మించడం వల్ల అతడిని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో దొరకడం వల్ల ఆ పిల్లాడిని సముద్ర లేదా సింధురాసురుడు అని పిలిచేవారు. సింధు పెద్దోడై సూర్యోపాసకుడిగా సుదీర్ఘకాలం తపస్సు చేస్తాడు.

Ganesh Chaturthi 2022: పురాణాల ప్రకారం ఎలాంటి గణపతి విగ్రహాన్ని ఎలా ఎంచుకోవాలి, వినాయకుడి తొండం కుడివైపు ఉండాలా, ఎడమ వైపు ఉండాలా, ఈ తప్పులు చేస్తే వినాయకుడి ఆగ్రహానికి గురవుతారు.. 

తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదిస్తాడు. అది ఉన్నంతకాలం సింధుకు మృత్యుభయం ఉండదు. ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడు. దేవతలపై కూడా దాడి చేశాడు. తర్వాత కైలాసం.. వైకుంఠంపై దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు. మహా విష్ణువును కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసురుడు ప్రకటించాడు. దేవ గురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి శరణు విన్న వినాయకుడు (Vinayakudu) సాక్షాత్కారమై.. తాను పార్వతీ దేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని హతమొందిస్తానని వారితో చెప్పాడట.

Ganesh Chaturthi 2022: వినాయక చవితి రోజు మీ రాశి ప్రకారం ఈ నైవేద్యం సమర్పిస్తే, మీరు జీవితంలో కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. 

పన్నెండేండ్లు మేరు పర్వతంపై గణేశుడి మంత్రం జపించారట. అలా భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి కొడుకుగా పుట్టాడట. ఒకసారి సింధురాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనధారియై కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధురాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. ‘మోర్‌’ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనమేసుకొని వచ్చి సింధురాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని.. అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో ‘గణపతి బప్పా మోరియా’ అని భక్తులు కొలుస్తుంటారు. అది క్రమంగా అంతటా వ్యాపించి.. ‘గణపతి బప్పా మోరియా’గా ప్రసిద్ధికెక్కింది.