Tea for Healthy Hair: జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఛాయ్‌తో షాంపూ చేసుకోండి, తేనీరుతో జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టవచ్చో ఇక్కడ కొన్ని పద్ధతులు చూడండి!

tea for healthy hair | pic: Pixabay

Tea for Healthy Hair: చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు టీ తాగగానే ఒత్తిడి మాయమై, చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది, చురుగ్గా పనులు చూసుకుంటారు. అయితే టీతో జుట్టు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. జుట్టు రాలడం, తెల్లబడటం అనేవి ఈరోజుల్లో వయసుతో సంబంధం చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఆడవారికైనా, మగవారికైనా, ఏ వయసు వారికైనా జుట్టు రాలడం సర్వసాధారణం అయిపోయింది. ఇందుకు ఒత్తిడి, ఆహరపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, జన్యులోపాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే తేయాకు కలిపిన నీటిని జుట్టుకు పట్టించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని చెబుతున్నారు.

టీతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు

తేనీటిలో యాంటీఆక్సిడెంట్లు, కాటెచిన్స్ వంటి ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలలో రక్త ప్రసరణను ప్రోత్సహించడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి, మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి, తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మీ జుట్టు సంరక్షణలో తేయాకు కలిపిన నీటిని ఉపయోగించడం ద్వారా మీ హెయిర్ ఫోలికల్స్‌కు అవసరమైన పోషకాలను అందించవచ్చు. ఇలా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా ఆరోగ్యకరమైన, బలమైన జుట్టును కూడా పొందవచ్చు.

టీలోని యాంటీఆక్సిడెంట్లు, వంటివి . ఇది హెయిర్ ఫోలికల్స్‌కు అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది, వాటిని బలంగా చేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

అంతేకాకుండా టీలో మీ జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఉదాహరణకు, గ్రీన్ టీలో విటమిన్ బి మరియు సిలు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ జుట్టు యొక్క మూలాలను బలపరిచి, విరిగిపోకుండా చేస్తుంది.

టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుచుండ్రు కలిగించే ఫంగస్ ఉత్పత్తిని తగ్గించడంలో, స్కాల్ప్‌పై దురదను నివారించడంలో సహాయపడతాయి.

టీలోని కెఫిన్ తల చర్మం ద్వారా ఉత్పత్తి అయ్యే సహజ నూనె సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. సెబమ్ ఉత్పత్తిని సమతుల్యం చేయడం ద్వారా, ఆరోగ్యకరమైన స్కాల్ప్‌కు సహాయపడుతుంది, ఇది ఆరోగ్యకరమైన, బలమైన జుట్టుకు అవసరం.

టీ కలిపిన నీరు మీ జుట్టుకు మెరుపునిస్తుంది. టీలో ఉండే టానిన్లు జుట్టు క్యూటికల్స్‌ను బంధించడంలో సహాయపడతాయి, వాటిని మృదువుగా, మరింత మెరిసేలా చేస్తాయి.

జుట్టు కోసం తేనీటిని ఎలా ఉపయోగించాలి?

నీటిలో తేయాకు వేసి మరిగించండి, ఆపై మరిగిన టీని గది ఉష్ణోగ్రతకు చల్లబరచండి. వేడిగా ఉపయోగిస్తే స్కాల్ప్ కు నష్టం చేకూర్చవచ్చు. కాబట్టి తేనీటిని మీ జుట్టుకు ఉపయోగించే ముందు టీని చల్లబరచడం చాలా ముఖ్యం.

అనంతరం మీ జుట్టును షాంపూ చేసిన తర్వాత, సిద్ధం చేసుకున్న తేనీటిని మీ జుట్టుకు వర్తింపజేయండి, ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

మీకు పొడి జుట్టు, పెళుసైన జుట్టు ఉంటే, మీరు మీ జుట్టును కండిషనింగ్ చేసిన తర్వాత చివరిగా తేనీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇది మీ జుట్టుకు తేమను అందించి మెరిసేలా చేస్తుంది.

ఇలా రెగ్యులర్ గా చేస్తుండటం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలని మీరు గమనించవచ్చు, జుట్టు రాలడాన్ని తగ్గించాలని చూస్తున్న ఎవరైనా తప్పనిసరిగా ఈ చిట్కా ప్రయత్నించాలి.

అయితే మీ జుట్టు రకానికి తగిన టీని ఎంచుకోవడం కూడా ముఖ్యమే. జిడ్డుగల జుట్టుకు గ్రీన్ టీ ఉత్తమంగా పనిచేస్తుంది,పెళుసైన జుట్టుకు బ్లాక్ టీ అనుకూలంగా ఉంటుంది, చమోమిలే టీ సెన్సిటివ్ స్కాల్ప్స్ ఉన్నవారికి చాలా మంచిది.