Sex Mountain: జంగల్ మే మంగల్! అక్కడ అపరిచితులతో శృంగారం చేసి మొక్కు చెల్లించుకోవటం ఆచారం. ఎవరు ఎవరితోనైనా గడపవచ్చు. దేశవిదేశాల నుంచి పోటెత్తుతున్న భక్తులు.

ఆ ప్రాంతంలో నివసించే ఆడవారు పెళ్లికాని యువతులైనా మరియు పైళ్లైన మహిళలైనా కూడా వారికి ఎదురుపడిన పరిచయం లేని వ్యక్తులతో వారితో శృంగారం చేసి మొక్కు చెల్లించుకోవడం వారి ఆచారం...

Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

అదొక చిన్న గ్రామం దానికి సమీపంలోని ఒక కొండ, చుట్టూ అడవి, మధ్యలో దైవంగా కొలిచే ఇద్దరి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ నివసించే ఆడవారు వారికి పరిచయంలేని వ్యక్తులతో శృంగారం చేసి ఆ దైవానికి మొక్కు చెల్లించుకోవడం ఆచారం. అలా చేస్తే ఆ ఇద్దరికీ జీవితంలో తిరుగులేని అదృష్టం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయనేది వారి నమ్మకం. అయితే ఇది తెలిసి తమ అదృష్టం పరీక్షించుకునేందుకు చాలామంది ఆ ప్రాంతానికి క్యూ కట్టారు. నిజంగా మొక్కు చెల్లించుకోవడం కోసం కొందరు, జీవితంలో అదృష్టం, సంపద దొరకపోయినా సరే, కనీసం అక్కడికి వెళ్లి 'మొక్కు' తీర్చుకుందామని కొందరు వెళ్లడం ప్రారంభించడంతో కొద్ది కాలంలోనే ఆ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిపొందింది.

ఎక్కడ అంటే, ఇండోనేసియాలోని  జావా ద్వీపంలో (Java Island, Indonesia) సోలో అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి 28 కి.మీల దూరంలో 'కెముకుస్' (Mount Kemukus) అనే కొండ ఉంది. దానినే గునుంగ్ కొండ, శృంగార కొండ (Sex Mountain) అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ కొండపై జావా యువరాజు పంగెరాన్ సామొడ్రో (Pangeran Samodro) మరియు అతని ప్రేయసి న్యాగి ఒంట్రోవులన్ ( Nyai Ontrowulan) విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ విగ్రహాలను 'జావనీస్ జాతి'కి చెందిన ప్రజలు అత్యంత పవిత్రమైనవిగా, తమ ఆరాధ్యదైవంగా దైవంగా కొలుస్తారు. జావా ఇథిహాసాలు, గ్రంథాలు కూడా వారి కథల ఆధారంగానే రచించబడ్డాయి.

పండగ సీజన్ లో (Pon Festival) ఇక్కడి ఆడవారు పెళ్లికాని యువతులైనా, పెళ్లైన మహిళలైనా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా ఈ కెముకుస్ కొండకు వెళ్లి ముందుగా అక్కడ విగ్రహాలను పువ్వులతో పూజచేసి, ప్రార్థనలు నిర్వహించాలి. ఆ తర్వాత అక్కడే స్నానం చేసి పరిశుభ్రంగా సిద్ధమవ్వాలి. ఇక అక్కడ ఉండి మొక్కు చెల్లించుకునేందుకు ఎవరైనా అపరిచిత వ్యక్తి కోసం వేచి చూడాలి. భాగస్వామి దొరికిన తర్వాత అతడికి ఆమె తన సర్వస్వం సమర్పించాలి. అది కూడా ఏదో తూతూమంత్రంగా చేయకూడదు. భక్తితో, శ్రద్ధతో అతడిపై ప్రేమను కురిపించాలి. అంతేకాదు ఇలా ఒక్కసారి చేస్తే సరిపోదు మొత్తం 7 సార్లు ప్రతీ 35 రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొనాలి. ఈ 7 సార్లు ఇద్దరు పరస్పరం ప్రేమను ఆస్వాదించినప్పుడే ఆ మొక్కు చెల్లించడం అనేది పూర్తవుతుంది.

ఈ ఆచారం వెనక కారణం ఏమిటి?

ఇక్కడి ఇథిహాసాల ప్రకారం జావా మహారాజుకు కుమారుడు యువరాజు పంగెరాన్ సామొడ్రో తనకు పిన్ని వరస అయ్యే అంటే మహారాజు చిన్న భార్య న్యాగి ఒంట్రోవులన్ తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ఒకరినొకరు ప్రేమించుకోవడం, అక్రమ సంబంధం కలిగి ఉండటం మహారాజుకు తెలిసిపోతుంది. దీంతో వారిద్దరూ భయంతో కోట వదిలి దగ్గర్లోని ఈ కెముకుస్ కొండకు వెళ్లి తలదాచుకుంటారు. అయితే మహారాజు పంపిన సైనికులు వీరి జాడను కనిపెట్టి వీరిని అక్కడికక్కడే నరికేసి ఆ కొండపైనే సమాధి చేస్తారు. అప్పట్నించి ప్రేమికుల రక్తంతో తడిసిన ఈ కొండ పవిత్రమైనదని జావనీస్ ప్రజలు నమ్ముతున్నారు. ఏ అక్రమసంబంధం అయితే ఇద్దరు ప్రేమికుల చావుకు కారణమైందో అదే అక్రమ సంబంధంతో ఇక్కడి మహిళలు  మొక్కులు చెల్లించుకోవడం ఆచారంగా మొదలైంది. అందుకే ఈ కొండపైన ఎదురుపడిన అపరిచితులతో ఇక్కడి మహిళలు ప్రేమలో పడి, శృంగారం చేసుకోవడం అనవాయితీగా ప్రారంభమైంది.

ఈ విషయం తెలిసి వందల కిలోమీటర్ల నుంచి ప్రజలు (మగవారు) మొక్కు చెల్లించుకునేందుకు తరలిరావటం ప్రారంభమైంది.

అయితే ఇక్కడి పరిస్థితులను చూసి కొంతమంది వ్యాపార ధోరణిలో ఆలోచించడం చేశారు. దీంతో ఈ మొక్కు అనేది పక్కదారి పట్టి వ్యాపారంగా తయారైంది. మొక్కు చెల్లించుకునేందుకు అంటూ ప్రత్యేక గదులు నిర్మించి గంటకు, రాత్రికి, రోజుకు చొప్పున అద్దెకివ్వడం ప్రారంభమైంది. హోటళ్లు, దుకాణ సముదాయాలు వెలిశాయి. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి యాత్రికులు పోటెత్తుతుండటంతో ఇక్కడి ప్రభుత్వం టోల్ గేట్ ప్రారంభించింది. ఇక్కడికి వెళ్లాలంటే 5000 ఇండోనేషియన్ రూపయ్యలు చెల్లించాలి. (భారత కరెన్సీ ప్రకారం కేవలం రూ. 25 మాత్రమే). విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగింది, ప్రభుత్వానికి దీని ద్వారా ఆదాయం విపరీతంగా రావడంతో ఈ 'అక్రమ శృంగారం' వ్యాపారం జోరుగా సాగింది.  దురదృష్టవషాత్తూ ఇక్కడ నిజాయితీగా మొక్కు చెల్లించుకునే జావనీస్ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేశారు, ఇక్కడి ముస్లిం కమ్యూనిటీ ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించింది. 90% శాతం స్థానిక ప్రజలు ఈ ప్రాంతం నుండి తరలిపోయారు.

జావనీస్ పవిత్రంగా భావించిన ఆ ప్రాంతమంతా సెక్స్ వర్కర్లతో ఒక రెడ్ లైట్ ఏరియాగా మారిపోయింది. ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక అంతర్జాతీయ వార్తా ఛానెల్ ఇక్కడ తప్పుదారి పట్టిన 'మొక్కు'ను, సుఖ వ్యాధులు ప్రబలుతున్న విషయాన్ని డాక్యుమెంటరీ రూపంలో టెలికాస్ట్ చేయడంతో 2014 లో ప్రభుత్వం 'శృంగార కొండ'పై వ్యాపారంపై నిషేధం విధించింది.

ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాగా బ్యాన్ ఎత్తివేశారు, హెల్త్ సెంటర్లు, ఉచిత కండోమ్స్ పంపిణీ ప్రారంభమైంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif