The Award winning photos: ఈ ఫోటోలు చూస్తే వాహ్ అనేంత ఆశ్చర్య పోవాల్సిందే. ట్రావెలింగ్ ఫోటో కాంటెస్ట్ 2019 విజేతలు వీరే!

పశ్చిమ గ్రీన్ లాండ్ లో, పోర్టుకు సమీపంలో ఉండే మత్య ఆధారితమైన ఉపర్ నేవిక్ ఓ చిన్న గ్రామం ఈ ఏడాది కాంటెస్టులో మొదటి బహుమతి గెలుచుకుంది.

Winner| National Geographic Photo Contest

వారు తీసిన ప్రతీ ఫోటో ఒక అద్భుతం, ప్రతీ ఫ్రేములో జీవం ఉంది. దీని వెనక వారి నిరంతర శ్రమ, పట్టుదల, ఓపిక అన్నింటికీ మించి ట్రావెలింగ్ (Travelling) అన్నా, ఫోటోగ్రఫీ (Photography) అన్నా విపరీతమైన ఇష్టం వారిని నేషనల్ జియోగ్రఫీ 2019 ట్రావెల్ ఫోటో కాంటెస్టులలో విజేతలగా నిలిపింది.

పశ్చిమ గ్రీన్ లాండ్ లో, పోర్టుకు సమీపంలో ఉండే మత్య ఆధారితమైన ఉపర్ నేవిక్   ఓ చిన్న గ్రామం ఈ ఏడాది కాంటెస్టులో మొదటి బహుమతి గెలుచుకుంది.

గ్రీన్ లాండిక్ శీతాకాలం (Greenlandic Winter) అనే క్యాప్షన్ తో వెయిమిన్ చూ (Weimin Chu)  అనే ఫోటోగ్రాఫర్ ఈ ఫోటో తీశాడు. ఆయన మాట్లాడుతూ.. ఆ ఊరును చూస్తే నా మనసుకు హాయిగోల్పేలా ఎంతో శ్రావ్యంగా అనిపించింది. ఊరంతా తెల్లటి మంచుతో కప్పబడి, సాయంకాల సమయంలో లేత నీలిరంగులో   శోభితమై, ఇళ్ల కిటికిల నుంచి లైట్ల వెలుతురు, నిర్మానుష్యమైన రోడ్డు నడుమ ఒక అందమైన ఫ్యామిలి నడుచుకుంటూ వెళ్లడం చూసిన నాకు ఆ దృశ్యం ఎంతో ముచ్చటగొలిపింది. దీంతో ఈ క్షణాలను ఎలాగైనా బంధించాలని అదేపనిగా ఫోటోస్ తీస్తూ ఉన్నాను అని చెప్పుకొచ్చాడు.

ఈ ఫోటోకు గాను వెయిమిన్ చూ $7,500 (మన కరెన్సీలో దాదాపు రూ. 5.2 లక్షలు)  ప్రైజ్ మనీగా అందుకున్నాడు.

2) జేసెన్ టొడొరోవ్ (Jassen Todorov) తీసిన శాన్ ఫ్రాస్కిస్కో అంతర్జాతీయ  విమానాశ్రయం సి (San Francisco International Airport) టీస్ విభాగంలో సిటీస్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది.

విమానం ల్యాండ్ అవుతుండగా అంతకంటే ఎత్తులో నుంచి విమానాశ్రయాన్ని  చాలా అందంగా చిత్రీకరించాడు. ఫోటోగ్రాఫర్ జేసెన్ మాట్లాడుతూ, ఈ ఫోటో కోసం మామూలుగా విమానాల ఎగిరేదానికంటే కంటే ఎక్కువ ఎత్తులో ఎగిరేందుకు విమానాశ్రయ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నాను. అంత ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి, విమానం షేక్ అవుతుంది, అయినా కష్టపడి ఈ ఫోటో తీశాను. ఆ తర్వాత నా ఆనందానికి అవధులే లేవు, చాలా థ్రిల్లింగ్ ఉందంటూ చెప్పుకొచ్చాడు.

 

3) బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వీధుల్లో ప్రార్థనలు జరుగుతుండగా సాందీపని చటోపాధ్యాయ్  తీసిన చిత్రం సిటీస్ విభాగంలో 3వ స్థానంలో నిలిచింది.

ప్రకృతి విభాగంలో ప్రథమ బహుమతి పొందిన ఫోటో: 'Tender Eyes'

ప్రకృతి విభాగంలో  రెండవ బహుమతి పొందిన ఫోటో :  'Dream Catcher

ప్రకృతి విభాగంలో మూడవ బహుమతి పొందిన ఫోటో :  కారుమబ్బుల డాల్ఫిన్- Dusky

ప్రకృతి విభాగంలో గౌరవ బహుమతి పొందిన ఫోటో -  King of the alps

అలాగే మనుషులు విభాగంలో ప్రథమ బహుమతి పొందిన ఫోటో: Showtime

మనుషులు విభాగంలో  రెండవ బహుమతి పొందిన ఫోటో :  Daily Routine

మనుషులు విభాగంలో మూడవ బహుమతి పొందిన ఫోటో :  Horses

మనుషులు విభాగంలో గౌరవ బహుమతి పొందిన ఫోటో :  Mood

 

Photo Credits| National Geographic Travel Photo Contest 2019.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now