TTD Darshan Tickets For May: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు తేదీలు విడుదల, ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే..

మే నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల తేదీలను టీటీడీ విడుదల చేసింది.వీటితో పాటుగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా విడుదల చేసింది. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Tirumala (File Image)

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల తేదీలను టీటీడీ విడుదల చేసింది.వీటితో పాటుగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా విడుదల చేసింది. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఇక.. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్‌లైన్ కోటాను రేపు(ఫిబ్రవరి 23) ఉదయం 11 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ దేవస్థానం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో పెట్టనుంది. దీంతోపాటు 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్లో అందుబాటులోకి టీటీడీ దేవస్థానం తీసుకురానుంది.

ఇక.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 13 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 69,191 మంది స్వామివారిని దర్శించుకోగా 22,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.60 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif