TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ, శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఇవిగో, అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు

నవంబర్‌ నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ వసతి కోటాను రేపు విడుదల చేయనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

Tirumala (Credits: Twitter)

Tiramala, August 24: నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. నవంబర్‌ నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ వసతి కోటాను రేపు విడుదల చేయనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 71,122 మంది దర్శించుకున్నారు. 29,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చింది.

తిరుమల శ్రీవారి భక్తులకు మరో వార్షికోత్సవం కనువిందు చెయ్యనుంది. ఆగస్టు 27 నుంచి వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంంది. ఎల్లుండి మాఢవీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగనున్నారు. మూడ్రోజుల పాటు(ఆగస్టు 29) వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్

కాగా ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి.

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లగేజీ విధానంలో ఆధునిక మార్పులు తెచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దింది. లగేజీ సెంటర్‌కు బాలాజీ బ్యాగేజ్‌ సెంటర్‌గా నామకరణం చేసింది. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..ఇప్పటి వరకు కాలిబాటలో వచ్చే భక్తుల లగేజీని తిరుపతిలో తీసుకొని తిరుమలలో మాన్యువల్‌గా ఇచ్చే విధానం ఉండేదని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌ తరహాలో భక్తులకు సేవలు అందించేందుకు కొత్త సాప్ట్‌వేర్‌ను రూపొందించామని తెలిపారు.

వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌, రూ.300 ప్రత్యేక దర్శనం, శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల మార్గంలో ఈ ఉచిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. లగేజీ కేంద్రాల్లో టికెట్‌ స్కాన్‌ చేయగానే భక్తుల లగేజీ ఎక్కడ ఉన్నదో పూర్తి వివరాలు తెలుస్తాయని, దాంతో లగేజీని భక్తులకు అందజేస్తామని ఈవో వెల్లడించారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 2 వరకు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు అష్టాదశ పాదపద్మారాధన, తిరుప్పావడై, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయనున్నారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకే అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్‌ 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.