Lucky Charms: ఆ రాశులలో పుట్టిన మగవారికి అమ్మాయిలు ఎక్కువగా ఆకర్శితులవుతారట. లిస్టులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.
ఆ రాశుల వారు ఎవరంటే..
హిందూ పురాణాల ప్రకారం మన్మథుడికి (Manmadhudu) ఎలాంటి అమ్మాయైనా ఆకర్శితమవుతుందని చెప్తారు. మన్మథుడిని అందంగా, నిత్యయవ్వనంతో అమ్మాయిలపైకి బాణాలను ఎక్కుపెడుతూ రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. అతడి విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతో అలంకరించబడి ఉంటాయని చెప్తారు. ఇదంతా పురాణగాథల్లో వింటుంటాం.
అలాగే ఇప్పటి కాలంలో కూడా ఎవరైనా మగవాడు ఎక్కువ మంది (Women) అమ్మాయిలతో కనిపిస్తే అతడ్ని మన్మథుడితో పోలుస్తారు. లేదా అతడికి ఎక్కడో రాసి పెట్టి ఉందిరా అని చెప్తారు. ఈ లైన్ ని అండర్ లైన్ చేసి పెట్టుకోండి.
మరి ఇప్పుడు కూడా మన్మథుడిగా చెలామణీ అయ్యేవాళ్ల దగ్గర మన్మథ బాణాలు ఏమైనా ఉన్నాయా? అమ్మాయిలను (Attract) ఆకర్శించాలంటే ఏం ఉండాలి? అందమా? డబ్బా? ఆస్తులా? ఇవేమి లేని వాళ్లకు కూడా అమ్మాయిలు ఆకర్శితులవుతారట. అదేలాగా అంటే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా వారికి ఎక్కడో రాసిపెట్టి ఉండాలంట.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ 4 రాశుల వారికి (Zodiac Signs) వారు పెద్దగా కష్టపడకుండానే సునాయసంగా అమ్మాయిలు ఆకర్శితులవుతారని చాలా ఖచ్చితమైన అధ్యయనం ద్వారా వెల్లడైందని చెప్తున్నారు. ఆ రాశుల వారు ఎవరంటే..
మిథున రాశి: అమ్మాయిల విషయంలో వీరంత అదృష్టవంతులు ఎవరూ ఉండరట. జెమిని జన్మరాశిగా కలిగిన మగవారు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా, వారి అందమైన వ్యక్తిత్వం కారణంగా అమ్మాయిలు మొదటి చూపు లేదా మొదటి పరిచయంలోనే ఆకర్శిలవుతారట.
ఈ రాశివారు మృదు స్వభావులై రొమాంటిక్ గా ఆలోచిస్తారు, అమ్మాయిలతో చాలా బాగా మాట్లాడగలిగే స్కిల్స్ ఉంటాయి వీళ్ల దగ్గర, చాలా ఎమోషనల్ కూడా, ఎదుటివారిని బాగా అర్థం చేసుకోగలరు. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలలో కోరుకునే లక్షణాలు ఇవే కాబట్టి వీరికి అమ్మాయిలలో బాగా డిమాండ్ ఉంటుందంట.
సింహ రాశి: సింహరాశి వారు స్వతహాగా మంచివారు, సేవాభావం కలిగి ఉంటారు. ఈ రాశివారు సంఘంలో మంచి గౌరవమర్యాదలు, సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలను కలిగిన అబ్బాయిలు అమ్మాయిలకు బాగా నచ్చుతారంట. వీళ్లను అమ్మాయిలు వారికి ఓ ఫ్రెండ్ లాగా, సెక్యూర్ అని భావిస్తారంట. వీరితో టైం స్పెండ్ చేయాలి, బాగా ఆటపట్టించాలని అమ్మాయిలకు అనిపిస్తుందంట. సో.. సింహరాశి వారికి కూడా అమ్మాయిలు ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారన్నమాట.
తులారాశి: ఈ రాశిగల మగవారు ఎప్పుడూ తమ ప్రత్యేకత కనబరుస్తారు. నలుగురికి భిన్నంగా వ్యవహరిస్తారు. వీరి మాటల్లో గానీ, నడవడికలో గానీ ఒక స్వాగ్ (Swag) మెయింటైన్ చేస్తారు. చాలా అందమైన అమ్మాయిలు ఇలాంటి లక్షణాలున్న అబ్బాయిలను కోరుకుంటారట.
అయితే వీరు అమ్మాయిల విషయంలో చాలా సిగ్గుగా, ఎమోషనల్ గా వ్యవహరిస్తారట. ఈ రాశి అబ్బాయిలు ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తే వారికి నో చెప్పాలని అమ్మాయిలకు అనిపించదని చెప్తున్నారు.
వృశ్చిక రాశి: ఈరాశి గల అబ్బాయిలు చాలా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారట. తమనితాము, తమ చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచటంకోసం వీరు దేనికైనా రెడీ అంటారు. బహూశా ఇవే లక్షణాలు వీరివైపు అందరిచూపు ఉండేలా చేస్తుంది. అమ్మాయిల చూపు కూడా.
సో.. పైన చెప్పిన నాలుగు రాశులవారు 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు' అనేసుకోవచ్చు.
ఇక మిగతా రాశులవారి సంగతి అంటారా? ఒక్కమాట గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకొక అమ్మాయి నెలరోజులకి పడుద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయైనా మగాడికి పడాలి, పడుద్ది. ఆ...!