IPL Auction 2025 Live

Airtel Net Profit: లాభాల్లో దుమ్మురేపిన భారతీ ఎయిర్‌టెల్‌, ఈ ఏడాది రూ.4160 కోట్లకు పెరిగిన నికర లాభం

గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1612.5 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.4160 కోట్లకు పెరిగింది.

airtel

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 results) రెండున్నర రెట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1612.5 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.4160 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.37,440 కోట్ల నుంచి 2.8 శాతం పెరిగి రూ.38,506.4 కోట్లకు పెరిగినట్లు ఆ కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన

భారతీ ఎయిర్‌టెల్ దేశీయంగా వచ్చే ఆదాయం 10.1 శాతం వృద్ధితో రూ.29,046 కోట్లకు పెరిగింది. సాధారణంగా ఈ సారి టెల్కోలకు వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ.211కు పెరగడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో రూ.200గా ఉంది. ఈ విషయంలో మిగిలిన కంపెనీలతో పోలిస్తే ఎయిర్‌టెల్‌ ముందు వరుసలో ఉంది. 4జీ/5జీ కస్టమర్ల సంఖ్య సమీక్షా త్రైమాసికంలో 67 లక్షల మంది పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. డేటా వినియోగం 26 శాతం వృద్ధి చెందిందని, సగటున ఒక్కో కస్టమర్‌ నెలకు 23.7 జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.