Ambulance in Fire: డివైడర్ ను ఢీ కొట్టడంతో అంబులెన్స్ లో మంటలు.. డ్రైవర్ మృతి.. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఘోర ప్రమాదం

హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడడంతో అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Credits: Twitter

Hyderabad, July 25: హైదరాబాద్ (Hyderabad) లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం (Accident) జరిగింది. డివైడర్ ను (Divider) ఢీ కొట్టి బోల్తా పడడంతో అంబులెన్స్ లో మంటలు (Ambulance in Fire) చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ (Driver) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మలక్ పేటకు చెందిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఇబ్రహీంపట్నం వెళ్లి తిరిగి వస్తోంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పేషెంట్ ను తీసుకెళ్లి దింపేసి తిరిగి వస్తుండగా హస్తినాపురం వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

IITH Student Case: విషాదాంతంగా మారిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కథ.. విశాఖ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న కార్తీక్.. ఈ ఉదయం వైజాగ్ సముద్రం ఒడ్డున మృతదేహం గుర్తింపు 

ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో..

చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని డ్రైవర్ ను బయటకు తీశారు. అయితే, తీవ్రగాయాలు, రక్తస్రావం కారణంగా డ్రైవర్ అప్పటికే చనిపోయారు. అంబులెన్స్ ను పక్కకు జరిపే ప్రయత్నం చేస్తుండగా అందులోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అంబులెన్స్ మంటల్లో కాలిపోయింది.

Hyderabad Rains: కుతుబ్ షాహీ మసీద్ పై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్.. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. పొద్దున్నే మళ్లీ మొదలైన వాన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement