Hyderabad, July 25: భారీ వర్షాలతో (Heavy Rains) హైదరాబాద్ (Hyderabad) నగరం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరవాసులను వణికించింది. నిన్నటి వర్షానికి కుతుబ్ షాహీ మసీద్ (Qutb Shahi mosque) పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్, అంబర్ పేటలలో 4 సెంటీమీటర్లు, గోషా మహల్ లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Hyderabad: Lightning damages Qutb Shahi mosque minaret at Langer Houz https://t.co/OCt863DL0Z
— Shakuntalaputra Raghavendra 🇮🇳(O+ve) (@Raghvarma) July 25, 2023
మళ్లీ మొదలైన వాన
గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మేయర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.