Newdelhi, July 25: ఇదో విషాద ఘటన. నోట్లో (Mouth) బల్లి (Lizard) పడటంతో రెండున్నరేళ్ల బాలుడు (Child) అనూహ్యంగా మరణించాడు. ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh) రాష్ట్రం కోర్బా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు. అందరిలోకి చిన్నవాడైన జగదీశ్ వయసు రెండున్నర ఏళ్లు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బాలుడు మంచంపై పడుకుని ఆడుకుంటుండగా తల్లి ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది. కాసేపటి తర్వాత తల్లి ఓమారు బిడ్డ వద్దకు రాగా బాలుడు అచేతనంగా కనిపించాడు.
Lizard Enters Mouth Of Child: ढाई साल के बच्चे के मुंह में घुसी छिपकली, मासूम की मौत संदिग्ध, जांच में जुटी पुलिस https://t.co/0lORYwIjsI #Chhattisgarh #ChhattisgarhNews @ChhattisgarhCMO@bhupeshbaghel@KorbaDist
— ETVBharat Chhattisgarh (@ETVBharatCG) July 24, 2023
బిడ్డ నోట్లో బల్లి
పరిశీలించి చూడగా బిడ్డ నోట్లో బల్లి కనిపించింది. దీంతో, భయపడిపోయిన మహిళ పెద్ద పెట్టున రోదించడంతో స్థానికులు వచ్చి చూసి చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. అయితే, బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేశారు. బల్లి శ్వాసకోశ నాళానికి అడ్డం పడటంతో ఊపరిరాడక చిన్నారి మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. పోస్ట్‌మార్టం తరువాత అసలు వాస్తవాలు తెలియాల్సి ఉంది.