తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం నుంచి మంగళవారం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు రెండ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు పడే ఛాన్స్ ఉంటుందని తెలిపింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి భారీ వర్షాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, ఖైరతాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.