Credits: Twitter

Hyderabad, July 25: ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) (ఐఐటీహెచ్) విద్యార్థి కార్తీక్ (Karthik) అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నగరం నుంచి విశాఖపట్టణం (Vishakhapatnam) చేరుకున్న విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదయం సముద్రం ఒడ్డున కార్తీక్ మృతదేహం లభ్యమైంది. కార్తీక్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Viral Video: భవనం పక్కనే పిడుగుపాటు.. కాలిపోయిన టీవీలు, ఫ్రిజ్‌లు.. హైదరాబాద్‌ అత్తాపూర్‌ లో ఘటన.. వీడియోతో

Telangana Rains: రానున్న మూడ్రోజులు మరింత దంచికొట్టనున్న వానలు.. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌

సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా..

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్ (మెకానికల్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 17న క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. అధికారుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ వెళ్లినట్టు గుర్తించారు. అతడి కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. చివరికి విద్యార్ధి కథ విషాదంగా ముగిసింది.

Hyderabad Rains: కుతుబ్ షాహీ మసీద్ పై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్.. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. పొద్దున్నే మళ్లీ మొదలైన వాన