Operation Ganga: నా కుక్క పిల్లను విమానంలో అనుమతిస్తేనే ఇండియాకు వస్తా, ఉక్రెయిన్‌లో భీష్మించుకు కూర్చున్న కేరళకు చెందిన వైద్య విద్యార్థిని
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన ఆర్య ఆల్డ్రిన్ అనే వైద్య విద్యార్థి తన ప్రియమైన సైబీరియన్ హస్కీ - జైరా (కుక్క పిల్ల)ను నాతో పాటే ఇండియాకు రావడానికి అనుమతిస్తేనే నేను ఇండియాకు వస్తానని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యువతి ప్రస్తుతం రోమేనియన్ సరిహద్దు వద్ద వేచి ఉంది. నేషనల్ పిరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్శిటీ, విన్నిట్సియా వైద్య విద్యార్థి అయిన ఆర్య (Arya Aldrin, Indian Medical Student) , జైరాను ఆమెతో పాటు తరలింపు విమానంలో అనుమతించేందుకు భారత అధికారుల అనుమతి కోసం వేచి ఉంది. "జైరా ( 5-Year-Old Siberian Husky 'Zairaa') లేకుండా తాను కివ్‌ని విడిచిపెట్టబోనని ఆమె ఇడుక్కిలోని తన తల్లిదండ్రులకు చెప్పింది.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా "స్పెషల్ మిలటరీ ఆపరేషన్" ప్రకటించిన (Operation Ganga) రోజు నుండి జైరాను (కుక్క పిల్ల) తీసుకువెళ్లడానికి పత్రాలను సిద్ధం చేయడానికి ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. ఆమెను అధికారులు బస్సులో రొమేనియన్ సరిహద్దుకు తీసుకెళ్లినప్పుడు కూడా, జైరా ఆమె ఒడిలో ఉంది. ఆమె అక్కడి నుంచి తన బట్టలు లేదా వస్తువులను పెద్దగా తీసుకోలేదు. కేవలం ఆమె వద్ద ఉన్నది జైరాకుసరిపడా ఆహార సరఫరా మాత్రమే, "అని వీడియోలో ఆమె తెలిపింది.
ఇడుక్కిలో ఆర్య స్నేహితుడు శ్యామ కృష్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్య ఐదు నెలల క్రితం జైరాను నవజాత కుక్కపిల్లగా ఉన్నప్పుడు తీసుకుంది. "నేను రొమేనియన్ సరిహద్దుకు చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ భారతీయ షెల్టర్‌లో ఉంటున్నాను. జైరాను నాతో పాటు ప్రయాణించడానికి అధికారులు అనుమతిస్తారని నా ఏకైక ఆశ. లేకుంటే నేను భారతదేశానికి వెళ్లను. కేవలం నా జైరా లేకుండా ఇండియా చేరుకోవడానికి చేసే ప్రయత్నం అర్థరహితం," అని శ్యామా షేర్ చేసిన వీడియో సందేశంలో ఆర్య అన్నారు.
శ్యామా ప్రకారం, జైరాకు ఆశ్రయం కల్పించడానికి ఆర్య ఉక్రెయిన్‌లోని పెంపుడు ప్రేమికులను సంప్రదించడానికి ప్రయత్నించింది. గతంలో వీధి కుక్కకు చపాతీ పెడుతూ మీడియా దృష్టిని ఆకర్షించిన ఉక్రేనియన్ జంట క్రిస్టినా మసలోవా. యూజీన్ పెట్రస్‌లను కూడా ఆమె సంప్రదించింది. కానీ యుద్ధం కారణంగా అవేమి ఏదీ ఫలించలేదు" అని ఆమె చెప్పింది.