Pushpa Movie Fever In Bangladesh: బంగ్లాదేశ్‌ను తాకిన పుష్ప ఫీవర్, క్రికెట్ మ్యాచులో తగ్గేదేలే మ్యానరిజంతో అదరగొట్టిన బంగ్లా బౌలర్..

ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.

Allu Arjun In Pushpa (Photo Credits: Mythri Movie Makers)

ఢాకా, జనవరి 23: పుష్ప ఫీవర్  క్రికెట్ ఆటగాళ్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా.. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేశారు. అలాగే పుప్ప రాజ్ డైలాగ్స్‏తో రచ్చ చేశారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.  బీబీఎల్‏లో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‏లో బంగ్లాదేశ్ చెందిన అమిత్ హసన్ వికెట్ తీశాడు. అంతేకాకుండా.. ఎక్స్ ట్రా కవర దిశగా బ్యాట్స్ మెన్ కొట్టిన షాట్‏ను ఫీల్డర్ పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో అమిత్ హసన్ అల్లు అర్జున్ డైలాగ్.. తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ మేనరిజాన్ని చూపిస్తూ. గడ్డం కింద నుంచి చేయి అడ్డంగా జరుపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif