Bengaluru Horror: బాత్రూమ్‌లో కలిసి స్నానం చేస్తూ యువ జంట దుర్మరణం.. గీజర్ లోంచి గ్యాస్ లీక్‌ కావడంతో స్పృహ తప్పి పడిపోయిన వైనం, కొద్దిసేపటికే దుర్మరణం.. బెంగళూరులో ఘటన

మరికొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నారు. ఎన్నెన్నో ఆశలతో ఉన్న ఆ యువ జంటను విధి కాటేసింది. బాత్రూమ్‌లో కలిసి స్నానం చేసేందుకు వెళ్లిన ఆ జంటను గీజర్‌లోంచి లీక్ అయిన గ్యాస్ పొట్టనబెట్టుకుంది.

Credits: Twitter

Bengaluru, June 13: మరికొద్ది రోజుల్లో వివాహం (Marriage) చేసుకోబోతున్నారు. ఎన్నెన్నో ఆశలతో ఉన్న ఆ యువ జంటను విధి కాటేసింది. బాత్రూమ్‌లో (Bathroom) కలిసి స్నానం (Bathing) చేసేందుకు వెళ్లిన ఆ జంటను గీజర్‌లోంచి లీక్ (Gas) అయిన గ్యాస్ పొట్టనబెట్టుకుంది. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, చామరాజనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్(30), బెళగావి జిల్లాకు చెందిన సుధారాణి(22) సహజీవనం చేస్తున్నారు. బెంగళూరులో ఉంటూ ఓ హోటల్‌లో పని చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారు.

Kothakota Dayakar Reddy Passes Away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత.. దయాకర్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం

కిటికీ మూసేసి.. లోపల

శనివారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లిన వారిద్దరూ కిటికీ మూసేశారు. అయితే, వారు స్నానం చేస్తుండగా గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ అయ్యింది. దీంతో, స్పృహ తప్పి పడిపోయిన వారు ఆ తరువాత కాసేపటికి మృతి చెందారు. ఆదివారం ఆ జంట డ్యూటీకి రాకపోయే సరికి సహోద్యోగులు వారి ఇంటికి వెళ్లారు. ఎన్ని మార్లు తలుపుకొట్టినా స్పందన లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్‌లో వారి మృతదేహాలు కనిపించాయి.

Jharkhand Horror: రూ.10 అడిగాడని కుమారుడిని అంతమొందించిన తండ్రి.. ఝార్ఖండ్‌లోని ఛత్రాజిల్లాలో దారుణం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement