Bihar Floods Photo-shoot: వరద నీటిలో అందాల ఒలకబోత! బీహార్ వరదలను విభిన్నంగా చూపిద్దామనుకున్న మోడెల్, అనుకున్నది ఒకటి..అయ్యింది మరొకటి!
బిహార్ వరదలను హైలైట్ చేయాలనే ఉద్దేశ్యంతో వరద నీటిలో ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అయింది, అయితే సోషల్ మీడియాలో చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు....
Patna, October 01: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్ రాష్ట్రం వరదలతో (Bihar Floods) అల్లాడుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని పట్నా సహా రాష్ట్రంలోని 15 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. NDRF మరియు SDRF సిబ్బంది అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నారు. సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు భారత వాయుసేన కూడా రంగంలోకి దిగింది. రోడ్లు కాలువలయ్యాయి, ఇండ్లు వాటర్ ట్యాంకులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. బోట్లలో కాలనీల చుట్టూ తిరుగుతూ సహాయక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ప్రజలకు ఉండటానికి చోటు, తినటానికి తిండి, కట్టుకోడానికి బట్టలు లేక ఒక్కసారిగా ఆనాధలుగా మారిపోయారా అన్నట్లు ఉంది, ఇదీ అక్కడి ప్రస్తుత పరిస్థితి.
అయితే , ఇలాంటి సందర్భంలో ఒక మోడెల్ విభిన్నంగా ప్రయత్నించాలనుకుంది. బిహార్ వరదలను హైలైట్ చేయాలనే ఉద్దేశ్యంతో వరద నీటిలో ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అయింది, అయితే సోషల్ మీడియాలో చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
మోడెల్ ఒలకబోస్తున్న అందాలు ఈ కింద ఫోటోలో చూడొచ్చు
పట్నాలోని NIFT లో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చేస్తున్న అదితి సింగ్, వరద నీటిలో సగం వరకు చీలికతో చాలా ఫ్యాషనేబుల్ గా ఉన్న ఒక రెడ్ స్కర్ట్ ధరించి, హై హీల్స్ వేసుకోని, అల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోషూట్ కు "వరద విపత్తులో సాగరకన్య" టైటిల్ కూడా పెట్టింది.
ఫోటోషూట్ కు సంబంధించిన మరో ఫోటో
దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫోటోగ్రఫర్ పనితనాన్ని , మోడెల్ స్టైల్స్ ను ప్రశంసిస్తున్నప్పటికీ, ఒక విషాదాన్ని అందంగా చూపించొద్దు అని హితవు పలుకుతున్నారు.