Man Bites Snake Twice: కాటేసిందనే కోపంతో పామును రెండు సార్లు కొరికి చంపేసిన రైల్వే కార్మికులు, ఘటన చూసి షాకయిన రైల్వే అధికారులు
మనోడి కొరుకుడు శక్తికి తట్టుకోలేక పాము చావగా అతను మాత్రం బతికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు.
Man Bites Snake Twice in Retaliation: బీహార్ లోని నవాడా జిల్లాలో ఓ వ్యక్తిని పాము కాటేయగా అతను ఏమాత్రం భయపడకుండా తిరిగి దాన్ని పట్టుకొని గట్టిగా రెండుసార్లు కొరికేశాడు. మనోడి కొరుకుడు శక్తికి తట్టుకోలేక పాము చావగా అతను మాత్రం బతికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు.
ఘటన వివరాల్లోకెళితే.. ఝార్ఖండ్ కు చెందిన సంతోష్ లోహర్ అనే 35 ఏళ్ల యువకుడు రైల్వే కార్మికుడు. బీహార్ లోని నవాడా జిల్లా రాజౌలీ పరిధిలో ఉన్న ఓ అడవి మధ్యన జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో సహచరులతో కలిసి పనిచేస్తున్నాడు. గత మంగళవారం రాత్రి పని ముగించుకొని నిద్రపోయేందుకు సిద్ధమవుతుండగా ఓ పాము ఉన్నట్టుండి వచ్చి అతన్ని చటుక్కున కాటేసింది. వీడియో ఇదిగో, ఖాళీ దగ్గు మందు సీసాను మింగిన తాచుపాము, అది నోట్లో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక విలవిల
దీంతో లోహర్ వెంటనే పామును పట్టుకొని రెండుసార్లు కొరకగా అది చచ్చిపోయింది. మరోవైపు ఈ విషయం తెలియగానే అధికారులు వెంటనే లోహర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా చికిత్స పొందిన అనంతరం మర్నాడు ఉదయానికి అతను కోలుకున్నాడు. ఇలా ఎందుకు చేశావని అడిగితే తన గ్రామంలో ఉన్న మూఢనమ్మకం గురించి లోహర్ చెప్పుకొచ్చాడు. పామును రెండుసార్లు కొరికితే అది కాటేయడం వల్ల మనిషి శరీరంలోకి చేరే విషం తిరిగి పాములోకి వెళ్లిపోతుందని నమ్మి అలా చేశానన్నాడు. అయితే ఏ రకమైన పాము అతన్ని కాటేసిందో మాత్రం తెలియరాలేదు.దేశంలో ఏటా పాముకాట్లకు సుమారు 50 వేల మంది బాధితులు మరణిస్తున్నారు.