Human 65: మనిషి మాంసంతో వంట చేసిన భర్త, ఆ దృశ్యాన్ని చూసి ఖంగుతిన్న భార్య, భయంతో పరుగులు తీసి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఓ వివాహిత ఎప్పట్లాగే ఆ రోజు కూడా వారాంతపు సంతకు వెళ్లి కూరగాయలు తీసుకుని వచ్చింది. అయితే ఆ రోజు త్వరగా ఇంటికి వచ్చిన భర్తను చూసి ఆశ్చర్యపోయిన ఆ భార్య, అందులోను భర్త వంట చేయడం చూసి సంబరపోడి పోయింది. అయితే దగ్గరికి వెళ్లే చూస్తే ఆ దృశ్యాన్ని చూసి మహిళకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే....

Representational Image (Photo Credits: ANI)

Bijnor, March 12: ఓ వివాహిత ఎప్పట్లాగే ఆ రోజు కూడా వారాంతపు సంతకు వెళ్లి కూరగాయలు తీసుకుని వచ్చింది. అయితే ఆ రోజు త్వరగా ఇంటికి వచ్చిన భర్తను చూసి ఆశ్చర్యపోయిన ఆ భార్య, అందులోను భర్త వంట చేయడం చూసి సంబరపోడి పోయింది. అయితే దగ్గరికి వెళ్లే చూస్తే ఆ దృశ్యాన్ని చూసి మహిళకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఘటన వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలోని తిక్కోపూర్ గ్రామంలో 32 ఏళ్ల వివాహిత మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికే వంటగదిలో తన భర్త సంజయ్ వంట చేస్తున్నట్లు కనిపించాడు. ఏం వంట చేస్తున్నాడో అని అతడి దగ్గరికి వెళ్లి చూడగా పెనం మీద మనిషి చేయి భాగాన్ని, మరియు వేళ్లను ఫ్రై చేస్తున్నాడు. పక్కన పాలిథీన్ కవర్ లో మనిషి శరీర భాగాలతో ఉన్న మాంసం కనిపించింది. ఆ మాంసంను కూర వండాల్సిందిగా భార్యను కోరాడు.

అయితే ఈ దృశ్యం చూసిన అతడి భార్యకు ఒళ్లంతా చమటలు పట్టి, నిలువెల్లా గజగజా వణికిపోయింది. నోట మాట రాలేదు, అపస్మారక స్థితి ఆవహించినట్లయి అక్కడికక్కడే కూలబడిపోయింది, అయితే వెంటనే తేరుకొని ప్రాణభయంతో పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. ఇరుగుపొరుగు వారందరినీ పిలిచింది, జరిగిన విషయం చెప్పింది. వారు కూడా ఖంగుతున్నారు. అందరూ కలిసి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంజయ్ మాత్రం తలుపులు గడియ పెట్టుకొని ఇంటి లోపలే ఉన్నాడు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు మొత్తం వెతికి మనిషి మాంసంను స్వాధీనం చేసుకున్నారు. మటన్ కూర తక్కువ వడ్డించిందని భార్యకు నిప్పు పెట్టిన భర్త

కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు సంజయ్ దగ్గర్లో ఉన్న స్మశానవాటికలో నుంచి ఓ మృతదేహం చేయి మరియు కొంత మాంసం తీసుకొని వచ్చినట్లు తేలింది. తాగుడుకు అలవాటు పడిన సంజయ్ ఆ మైకంలోనే ఇలా చేసినట్లు చెప్పారు.

కొన్ని రోజుల కిందట కూడా ఇంట్లో ఉండే తన ముసలి తండ్రిని తాగి వచ్చి కుల్లబొడిచినట్లు భార్య అతడి ప్రవర్తన గురించి పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం నిందితుడిని జైలులో ఉంచారు. అయితే ఆ మహిళ మాత్రం ఇక ఇంటికి ఎంత మాత్రం వెళ్లనని తెగేసి చెప్పింది. ఈ ఘటన గత సోమవారం జరిగినట్లు సమాచారం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement