Chandra Grahan 2024: చంద్రగ్రహణం ఎలా, ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం భారత్ లో కనిపిస్తుందా ? పూర్తి వివరాలు ఇవిగో..
ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనున్నది.ఇది పాక్షిక గ్రహణం కాగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు.
రేపు రాత్రి ఆకాశంలో అందమైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనున్నది.ఇది పాక్షిక గ్రహణం కాగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు. దీన్నే చంద్రగ్రహణంగా పిలుస్తారు. వాస్తవానికి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఉపగ్రమైన చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. సూర్యుడి, చంద్రుడి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యకాంతి చంద్రుడిని చేరుకోలేకపోతుంది. దాంతో భూమినీడ చంద్రుడిపై పడుతుంది. దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తుంటారు.
చంద్రగ్రహణం సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదు? గ్రహణ సమయంలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి
అయితే, ఈ ఏడాది గ్రహణం భారత్‌లో కనిపించేందుకు అవకాశం లేదు. ఈ చంద్రగ్రహణం యూరప్, ఆఫ్రికా, నార్త్, సౌత్ అమెరికాతో పాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపించనున్నది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.11 గంటల సమయం ఏర్పడి.. 10.17 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం 4 గంటల 6 నిమిషాల పాటుఈ గ్రహణం కొనసాగుతుంది. ఈ గ్రహణాన్ని నాసా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా పత్యక్ష ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
ఈ సారి పాక్షిక చంద్రగ్రహణం దర్శనమివ్వనున్నది. ఇక రేపు చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా కనిపించనున్నాడు. దీన్నే సూపర్‌మూన్‌గా పిలుస్తుంటారు. ఈ సూపర్‌మూన్‌ని హార్వెస్ట్ మూన్‌గా పిలుస్తారు.