Messi Assam Connection: మెస్సీ అస్సాంలో పుట్టాడన్న కాంగ్రెస్ ఎంపీ... నెటిజన్ల భారీ ట్రోలింగ్.. ట్వీట్లు తొలగింపు

మెస్సీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిక్ చేసిన ఓ ట్వీట్ ఆయన్ని అభాసుపాలయ్యేలా చేసింది. అర్జెంటీనా వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ఓ ట్వీట్ చేశారు. మెస్సీని అభినందిస్తూ, నువ్వు అస్సాంతో సంబంధం కలిగి ఉన్నందుకు గర్విస్తున్నామని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు నివ్వెరపోయారు.

Credits: Google

Newdelhi, Dec 20: అర్జెంటీనా (Argentina) ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) గెలవడాన్ని ఆ దేశంలోని వారే కాకుండా భారత్ లోని అభిమానులు కూడా ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే... దేశాలకు అతీతంగా అభిమానులను సొంతం చేసుకున్న లియోనెల్ మెస్సీ (Messi) ఆ జట్టులో ఉన్నాడు మరి. ఈ క్రమంలో మెస్సీని ఉద్దేశిస్తూ  కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిక్ (Abdul Khaleque) చేసిన ఓ ట్వీట్ ఆయన్ని అభాసుపాలయ్యేలా చేసింది.

శుభవార్త.. సంక్రాంతి బస్సులకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ

అర్జెంటీనా వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ఓ ట్వీట్ చేశారు. మెస్సీని అభినందిస్తూ, నువ్వు అస్సాంతో (Assam) సంబంధం కలిగి ఉన్నందుకు గర్విస్తున్నామని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు నివ్వెరపోయారు. ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నిస్తూ, మెస్సీకి అస్సాంతో  కనెక్షన్ ఉందా? అంటూ ట్వీట్ చేయగా.... అవును, మెస్సీ అస్సాంలోనే పుట్టాడు అంటూ ఎంపీ బదులిచ్చారు. ఈ ట్వీట్లు కొద్ది సమయంలోనే వైరల్ అయ్యాయి. నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీపై  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎంపీ తన ట్వీట్లను తొలగించారు.

పాతబస్తీలో దారుణ హత్య, ఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ అల్లుడుని కిరాతకంగా నరికేసిన ఆరుగురు వ్యక్తులు, స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని అనుమానాలు

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement