Corona In China: చైనాలో కొనసాగుతున్న కరోనా బీభత్సం.. ఇప్పటికే 80 శాతం జనాభాకు వైరస్... వారం రోజుల్లో 13 వేల మరణాలు

చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల లాక్ డౌన్లు ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. గడచిన వారం రోజుల్లో చైనాలో 13 వేల మంది కరోనాతో మృత్యువాత పడినట్టు వెల్లడైంది.

Credits: Twitter

Beijing, Jan 23: చైనాలో (China) కరోనా మహమ్మారి Corona) కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) బీఎఫ్-7 (BF-7) విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల లాక్ డౌన్లు (Lockdowns) ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. దానికితోడు, చైనా వ్యాక్సిన్ల (China Vaccine) పనితీరుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, చైనాలో కరోనా మరణాలు తీవ్ర ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి.

చెదిరిన టీమిండియా కల, పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ ను ఓడించిన న్యూజిలాండ్, హాకీ వరల్డ్ కప్‌లో వెనుదిరిగిన భారత్

గడచిన వారం రోజుల్లో చైనాలో 13 వేల  మంది కరోనాతో మృత్యువాత పడినట్టు వెల్లడైంది. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం జనవరి 12 వరకు 60 వేల మంది చనిపోగా, ఈ వారం రోజుల్లో భారీస్థాయిలో కరోనా బాధితులు మరణించడం చైనా అధికార వర్గాలను కలవరపరుస్తోంది. చైనా అధికారులు చెబుతున్న కరోనా మరణాలు ఆసుపత్రుల్లో నమోదైనవే. ఇళ్లలో చనిపోయిన వారిని కూడా లెక్కిస్తే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.

సింగర్ మంగ్లీ కారుపై రాళ్లతో దాడి, బళ్లారిలో పాటపాడి వస్తుండగా దాడికి పాల్పడ్డ దుండగులు, ఆ వ్యాఖ్యలే దాడికి కారణమా?

చైనా నూతన సంవత్సర వేడుకల కోసం చాలామంది సొంత ఊర్లకు వెళ్లారని, దాంతో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు, చైనా నూతన సంవత్సర వేడుకల అనంతరం రోజువారీ మరణాల సంఖ్య 36 వేలకు చేరుకునే అవకాశం ఉందని ఎయిర్ ఫినిటీ అనే సంస్థ అంచనాలు వెల్లడించింది. దేశ జనాభాలో ఇప్పటికే 80 శాతం మందికి వైరస్ సోకినట్టు అక్కడి అధికారులు అంచనా వేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now