Abhishek Sharma, Varun Chakaravarthy Power Hosts to Dominant Victory

Kolkata, JAN 22:  ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం (IND Win By 7 Wickets) సాధించింది. తొలుత ఇంగ్లాండ్ సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) (79; 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

India Men's Team Wins Kho Kho World Cup 2025: ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్‌ భారత్‌ సొంతం  

సంజు శాంసన్ (26; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్ వర్మ (19*; 16 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 చెన్నై వేదికగా శనివారం (జనవరి 25) జరగనుంది.

Abhishek Sharma, Varun Chakaravarthy Power Hosts to Dominant Victory

 

ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) పరుగులు చేశారు. ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టన్ డకౌట్ కాగా.. బెన్ డకెట్ (4), జాకబ్‌ బెతెల్ (7), జేమీ ఒవర్టన్ (2) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.